రాజీనామా చేయనున్న జపాని ప్రధాని అబే!

రాజీనామా చేయనున్న జపాని ప్రధాని అబే!

హెల్త్ ఇష్యూస్‌ కారణమని సమాచారం
టోక్యో: జపాన్ ప్రధాని షింజో అబే రాజీనామా చేయనున్నారని సమాచారం. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అబే రాజీనామాకు సర్వం సిద్ధం అయిందని జపాన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే శుక్రవారం తెలిపింది. తన హెల్త్ కండీషన్ ప్రభావం ప్రభుత్వ పాలనపై పడకూడదని అబే కోరుకుంటున్నట్లు తెలిసింది. రీసెంట్‌గా అనారోగ్యంతో ఆయన రెండుసార్లు ఆస్పత్రికి వెళ్లొచ్చారు. కొన్నేళ్లుగా క్రోనిక్ డిసీజ్ అయిన అల్సరేటివ్ కోలిటిస్‌తో ఆయన బాధపడుతున్నారు. శుక్రవారం ప్రెస్‌ మీట్‌లో మాట్లాడనున్న అబే.. ఇందులో రాజీనామా గురించి ప్రస్తావిస్తారని స్థానిక మీడియా సమాచారం. అయితే షింజో అబే ఆరోగ్యకరంగా ఉన్నారంటూ జపాన్ అధికార పార్టీ అధికారులు చెబుతుండటం గమనార్హం. కానీ అబే ఆస్పత్రికి వెళ్లి రావడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.