టీమిండియా కెప్టెన్గా బుమ్రా

టీమిండియా కెప్టెన్గా బుమ్రా

ఇంగ్లాండ్తో జులై 1 నుంచి జరిగే ఏకైక టెస్టుకు కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు.   కొవిడ్ కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో..అతడి స్థానంలో బుమ్రాను బీసీసీఐ ఎంపిక చేసింది. రిషబ్ పంత్ ఈ టెస్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. 

శుక్రవారం నుంచి టెస్ట్ మొదలు కావాల్సిన నేపథ్యంలో..బీసీసీఐ మీటింగ్ నిర్వహించింది. ఈ సమావేశంలో రోహిత్ ఆరోగ్యంపై చర్చ జరిగింది. అయితే రోహిత్ కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఐదో టెస్టుకు అతన్ని సారథ్య బాధ్యతల నుంచి బీసీసీఐ తప్పించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీని పంత్ లేదా విరాట్ కోహ్లీలకు అప్పగించాలన్న చర్చ నడించింది. చివరకు బీసీసీఐ బుమ్రా వైపు మొగ్గు చూపింది. 

ఇంగ్లాండ్తో జరిగే టెస్టుకు కెప్టెన్ ఎంపికైన బుమ్రా..మరో ఘనత సాధించబోతున్నాడు. టీమిండియాకు కపిల్ దేవ్ తర్వాత సారథ్యం వహించన పేసర్గా రికార్డులకెక్కనున్నాడు. ఎడ్జబాస్టన్ టెస్టులో కపిల్ తర్వాత సారథ్య బాధ్యతలు నిర్వహించిన బౌలర్గా బుమ్రా రికార్డు సృష్టిస్తాడు. 

2021లో కరోనా వల్ల ఇంగ్లా్ండ్, టీమిండియా మధ్య జరగాల్సిన చివరి టెస్టు ఆగిపోయింది.  జులై1 నుంచి  టెస్టు షెడ్యూల్ ఉండగా..ఇందు కోసం భారత్ ఇంగ్లాండ్లో అడుగుపెట్టింది. అయితే  లీస్టర్షైర్తో  ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుండగా  రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు.  టెస్టు ప్రారంభం అయ్యే సమయానికి కోలుకుంటాడని అనుకున్నారు. కానీ..రోహిత్ కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకోలేదు.  దీంతో అతడికి విశ్రాంతినిచ్చింది టీమ్ మేనేజ్మెంట్...సారథ్య బాధ్యతలను బుమ్రాకు అప్పగించింది. అటు రోహిత్ శర్మ కు కొవిడ్  సోకడంతో అతడి రిప్లేస్మెంట్గా వచ్చిన మయాంక్ అగర్వాల్ జట్టుతో చేరాడు.