V6 News

నవోదయ ప్రవేశ పరీక్షకు 6 సెంటర్లు

 నవోదయ ప్రవేశ పరీక్షకు 6 సెంటర్లు

మెదక్​టౌన్, వెలుగు: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష–2026కు  ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో విజయ ఒక ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని వర్గల్ విద్యాలయంలో 2026-–27 విద్యాసంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఇందుకోసం మెదక్ జిల్లాలో మెదక్​ పట్టణంలోని సిదార్థ్ మోడల్ స్కూల్(వెంకట్రావునగర్​కాలనీ), సిద్ధార్థ మోడల్ హైస్కూల్(బి) వెంకట్రావునగర్​ కాలనీ,  గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్, మెదక్​లోని చిల్డ్రన్స్​పార్కు వద్ద ఉన్న గీతా హైస్కూల్, నర్సాపూర్​లోని ఆర్డీవో కార్యాలయం వెనక ఉన్న జడ్పీహెచ్ఎస్​ బాయ్స్​హైస్కూల్, రామాయంపేట పట్టణంలోని మంజీరా విద్యాలయంలో మొత్తం 6 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 13న ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 1,197 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు.