స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఇక అల్లు అర్జున్ తో మూవీ షురూ? మరో హిట్ కన్ఫర్మ్!

స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఇక అల్లు అర్జున్ తో మూవీ షురూ? మరో హిట్ కన్ఫర్మ్!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) జవాన్(Jawan) మూవీతో బాక్సాపీస్ హిట్ అందుకున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్కు ముందే సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక హిందీ, తమిళం, తెలుగులో విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్గా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో కల్లెక్షన్స్ సునామీ క్రియేట్ చేయడం కన్ఫర్మ్ అంటున్నారు సినీ క్రిటిక్స్.

ఇక లేటెస్ట్గా డైరెక్టర్ అట్లీ నుంచి రాబోయే మూవీస్ పైన ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా అంతటా డైరెక్టర్ అట్లీ పేరు కనిపిస్తోంది.ఈ డైరెక్టర్ తన తర్వాతీ ప్రాజెక్ట్ను నేషనల్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) తో చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ సోషియో ఫాంటసీ నేపథ్యంలో..రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని స్టోరీ రెడీ చేసినట్టు సమాచారం.

దీంతో త్వరలో వీరిద్దరీ కాంబో నుంచి మూవీ రానున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ అట్లీ నుంచి వచ్చిన ఐదు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో..అల్లు అర్జున్ మూవీపై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఆఫీసియల్గా అనౌన్స్ రాకపోయినప్పటీ వీరిద్దరి కాంబో కన్ఫర్మ్ అయినట్టే అని టాలీవుడ్, కోలివుడ్ నుంచి న్యూస్ వైరల్ అవుతుంది.  

ALSO READ :విరాట్ కోహ్లీ బయోపిక్.. ఆయన కథలో అంత విషయం లేదు.

హీరో ఆర్య రాజా రాణి మూవీ తర్వాత డైరెక్టర్ అట్లీ..దళపతి విజయ్‌ (Vijay)తో వరుసగా మూడు చిత్రాలు తెరకెక్కించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌,మెస్సేజ్ నేపథ్యంలో రూపొందిన తెరి (Theri), మెర్సల్, బిగిల్ మూవీస్ హీరో విజయ్ కెరీర్లోనే హైయెస్ట్ కల్లెక్షన్స్ సాధించాయి. దీంతో షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ సైతం పఠాన్ క్రియేట్ చేసిన బాక్సాపీస్ కల్లెక్షన్స్ ను క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాల సమాచారం.