రామానుజుల వారి జీవిత కథ ఈ సినిమా

రామానుజుల వారి జీవిత కథ ఈ సినిమా

లయన్ సాయివెంకట్ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘జయహో రామానుజ’. సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మాతలు. ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్ ఫిలిం చాంబర్‌‌‌‌‌‌‌‌లో జరిగింది. సుమన్ మాట్లాడుతూ ‘రామానుజం పాత్రకు సాయి వెంకట్ సెట్ అయ్యారు. అలాగే నేను చేసిన ఢిల్లీ రాజు కారెక్టర్ చాలా బాగా వచ్చింది. ఇలాంటి ఆధ్యాత్మికమైన పాత్రలు చేయడానికి దేవుడి పర్మిషన్ కావాలి. ఇది కేవలం ఇండియన్ సినిమా కాదు.. వరల్డ్ సినిమా. అద్భుతంగా తీశారు. బాగా ఆడుతుందని ఆశిస్తున్నా’ అన్నారు. 

సాయి వెంకట్ మాట్లాడుతూ ‘రామానుజుల వారి మీద ఇప్పటి వరకు ఐదు సినిమాలు వచ్చాయి. కానీ ఏవీ కూడా థియేటర్ల వరకు రాలేదు. అందుకే పక్కా ప్లానింగ్‌‌‌‌తో ఫిబ్రవరిలో రిలీజ్‌‌‌‌కు రెడీ చేస్తున్నాం’ అన్నారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి, జనరల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. హీరోయిన్ జో శర్మ, నిర్మాతలు సాయి ప్రసన్న, ప్రవల్లిక పాల్గొన్నారు.