తని ఒరువన్ రేంజ్లో.. ఆసక్తి కలిగిస్తున్న జయం రవి ఇరైవన్ ట్రైలర్

తని ఒరువన్ రేంజ్లో.. ఆసక్తి కలిగిస్తున్న జయం రవి ఇరైవన్ ట్రైలర్

తమిళ మూవీ తని ఒరువన్(Thani Oruvan) తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు జయం రవి(JayamRavi). అదే మూవీని తెలుగులోధ్రువగా రీమేక్ చేసి రామ్ చరణ్ హిట్ కొట్టారు. ఇక జయం రవి తమిళ నటుడే అయినా డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక లేటెస్ట్గా జయం రవి నుంచి ఇరైవన్( Iraivan) మూవీ రాబోతుంది. ఐ అహ్మద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. పోలీస్ ఆఫీసర్ అర్జున్ క్యారెక్టర్లో కనిపిస్తోన్న జయం రవి చాలా ఇంటెన్సివ్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు. 

ఈ మూవీ కమర్షియల్ యాంగిల్తో పాటు సమాజంలో జరిగే రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని వస్తోంది.ట్రైలర్లో..అమ్మాయిలని టార్గెట్ చేసి, మర్డర్ చేసే సైకో కిల్లర్ మైండ్ సెట్ని డైరెక్టర్ క్లియర్గా చూపించారు. వరసగా అమ్మాయిలని కిరాతకంగా చంపి..వారి బాడీ పార్ట్స్ని వేరు చేసి, ఆనందం పొందే సైకోని పట్టుకోవడానికి జయం రవి స్పెషల్ ఆఫీసర్గా.. సీరియస్ ఇంటెన్స్ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు.

ఇక స్టోరీ థీమ్ని ట్రైలర్లో చూపించిన డైరెక్టర్ ఆలోచన గ్రేట్ అని చెప్పుకోవాలి. ఈ మధ్య వచ్చిన మూవీస్లో ట్రైలర్తో అట్ట్రాక్ట్ చేసి సినిమాలతో బోర్ కొట్టిస్తున్న డైరెక్టర్స్ చాలానే ఉన్నారు.ఆ డైరెక్టర్స్ లిస్టులో ఐ అహ్మద్ లేకపోవడం విశేషం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరైవన్ డైరెక్టర్ ట్రైలర్ లోనే సిన్సియర్గా స్టోరీపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ మూవీలో జయం రవికి జోడీగా స్టార్ హీరోయిన్ నయనతార యాక్ట్ చేస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన తని ఒరువన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ఇక ఇరైవన్ మూవీ కూడా హిట్ అవ్వడం కన్ఫర్మ్ అంటున్నారు జయం రవి ఫ్యాన్స్. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు. సైకో కిల్లర్ అమ్మాయిలని చంపే టైంలో యువన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా ఉంది. ఫ్యాషన్ స్టూడియోస్ ఈ మూవీని నిర్మిస్తున్న ఈ మూవీ 2023 సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

 చైల్డ్ ఆర్టిస్ట్‌‌గా  కెరీర్ మొదలుపెట్టి, ‘జయం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రవి ఇప్పటివరకు ఇరవై ఐదు చిత్రాలు పూర్తి చేశాడు.ఇక త్వరలో తని ఒరువన్ 2 మూవీ తెరకెక్కబోతుంది.