జయమ్మ సమస్యే కథ

జయమ్మ సమస్యే కథ

జయమ్మ సమస్యే కథ
సుమ ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ చిత్రం మే 6న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు విజయ్ కుమార్‌‌‌‌ కలివరపు ఇలా మాట్లాడారు. ‘‘మాది శ్రీకాకుళం జిల్లా. పీజీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తూ షార్ట్ ఫిల్మ్స్‌‌ తీశాను. స్టార్స్‌‌తోనే సిని మాలు తీయాలనుకునేవాణ్ని. అదంత సులువు కాదనే విషయం తర్వాత తెలిసింది. దాంతో ఫ్రెండ్స్‌‌తో కలిసి ఓ చిన్న సినిమా తీయా లని ఇది మొదలుపెట్టాను. లీడ్‌‌ రోల్‌‌లో సుమ, సంగీత దర్శకుడిగా కీరవాణి ఈ ప్రాజెక్ట్‌‌లోకి వచ్చాక సినిమా స్థాయి పెరిగింది. సింక్‌‌ సౌండ్‌‌లో తీశాం కనుక నెల రోజుల ముందే నటీనటులందరికీ వర్క్ షాప్ ఏర్పాటు చేశాం. కల్పిత కథే అయినప్పటికీ నా జీవితంలో కలిసిన వ్యక్తులు, పరిస్థితుల నుంచి స్ఫూర్తి పొంది రాశాను. టైటిల్ కూడా కథ నుంచి వచ్చిందే. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం జయమ్మది. తనకి అనుకోకుండా ఓ సమస్య వస్తుంది. అది కాస్తా ఊరి సమస్యగా మారుతుంది. జయమ్మ చాలా పవర్‌‌‌‌ఫుల్‌‌. ఒక్కోసారి అమాయకురాలిగానూ కనిపిస్తుంది. సినిమా అంతా శ్రీకాకుళం యాసలో ఉంటుంది. సుమ ఏ విషయాన్నైనా చాలా స్పీడ్‌‌గా నేర్చేసుకుంటారు. నాలుగు పాటలుంటాయి. అన్నీ కథను ముందుకు తీసుకెళ్లే సిట్యువేషనల్ సాంగ్స్. సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకముంది.’‘