
చదలవాడ శ్రీనివాసరావు దర్శక నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. నిహిర్ కపూర్, సత్య కృష్ణ , సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మార్చి 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ తర్వాత నేను డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ప్రేక్షకుల మనసుకి హత్తుకునే విధంగా నిజానికి దగ్గరగా ఉండేలా దీన్ని చిత్రీకరించాం.
మేము రిలీజ్ చేసిన ‘బిచ్చగాడు’ సినిమాలో తల్లి కోసం బిడ్డ కష్టపడతాడు. ఇందులో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుంది అనేది కాన్సెప్ట్. రెజ్లింగ్ కోసం చైనా వెళ్లిన పిల్లలు.. భారతదేశం కోసం గెలిచి రావడానికి తల్లి పడిన కష్టం అందరిని ఆకట్టుకుంటుంది. జయసుధ గారి కొడుకు నిహిర్ కపూర్ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాకు యాప్ట్ అయ్యింది. సత్య కృష్ణ, ప్రసన్న కుమార్, కాశీ విశ్వనాథ్‌తో సహా ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. గ్రాఫిక్స్‌కి ఇంపార్టెన్స్ ఉన్న చిత్రమిది.
ఇప్పటికే కొందరికి సినిమా చూపించగా ప్రతి ఒక్కరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గతంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్ భార్యాభర్తల్లా ఉండేవారు. ఇప్పుడు డైరెక్టర్, హీరో ఒకటయ్యి.. ప్రొడ్యూసర్‌కి విలువ ఇవ్వట్లేదు. సినిమాల సక్సెస్ రేట్ తగ్గడానికి ఇదే ప్రధాన కారణం. నేను బ్రతికుండగా పెద్ద హీరోలతో పెద్ద బడ్జెట్ సినిమాలు చేయను’ అని చెప్పారు.