లగ్జరీ కారు కొన్న టీమిండియా బౌలర్.. ఆ డబ్బే అంటున్న నెటిజన్స్

 లగ్జరీ కారు కొన్న టీమిండియా బౌలర్.. ఆ డబ్బే అంటున్న నెటిజన్స్

టీమిండియా పేస్ బౌలర్, ఒకప్పటి ఐపీఎల్ ఖరీదైన ఆటగాడు జైదేవ్ ఉనద్కట్.. తాజాగా ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశారు. జర్మనీ కార్ల దిగ్గజం మెర్సిడీజ్ బెంజ్‌కు చెందిన జీఎల్ఈ ఎస్‌యూవీ(Mercedes-Benz GLE SUV) కోసం అతడు రూ.1 కోటి వెచ్చించడం గమనార్హం. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఉనద్కట్.. కొన్నిరోజుల ముందే ఈ కారు కొన్నా తాజాగా ఆ వీడియో బయటకొచ్చింది.

7.2 సెకన్లలోనే 100 కి.మీ. వేగం

భారత్‌లో పాపులర్ అయిన జర్మన్ ఎస్‌యూవీల్లో ఈ మెర్సిడీజ్ బెంజ్ జీఎల్ఈ కూడా ఒకటి. ఈ కారు కేవలం 7.2 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగం అందుకోగలదు. గరిష్టంగా గంటకు 225 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలదు. ఇందులో పనోరమిక్ సర్ రూఫ్, ఏడు ఎయిర్ బ్యాగులు, క్లైమేట్ కంట్రోల్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. గుజరాత్‌లోని మెర్సిడీజ్ బెంజ్ ల్యాండ్ మార్క్ కార్స్ షోరూమ్ లో అతడు ఈ కారు కొనుగోలు చేశారు.

10 ఏళ్ల తర్వాత జట్టులోకి ఎంట్రీ

సుమారు 10 ఏళ్ల తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఉనద్కత్.. ఈ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోకపోయాడు. అతడు చివరిసారి 2013లో ఇండియా తరఫున వన్డే ఆడారు.

ఐపీఎల్ డబ్బు అంటున్న నెటిజన్స్

కాగా, ఐపీఎల్‌-2018 సీజన్‌లో ఉనద్కట్‌ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఉనద్కట్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పేసర్‌ కోసం రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీ ఏకంగా 11.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆ డబ్బుతోనే ఇంత ఖరీదైన కారు కొనుగోలు చేశాడంటూ నెటిజన్స్ అతన్ని ఆట పట్టిస్తున్నారు.