విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలె :  జేడీ లక్ష్మీనారాయణ 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలె :  జేడీ లక్ష్మీనారాయణ 

కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ ను మాత్రమే ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని, సెయిల్ ను ఎందుకు ప్రైవేటీకరణ చేయటం లేదని ప్రశ్నించారు. 2017లో నేషనల్ స్టీల్ పాలసీ తీసుకొచ్చారని, 2030 నాటికి స్టీల్ కెపాసిటీ 300 మిలియన్ టన్నులు చేయాలనేది లక్ష్యం అని చెప్పారు. 122 మిలియన్ టన్నులు ప్రస్తుతం నడుస్తుందని.. మన స్టీల్ ప్లాంట్ కెపాసిటీ పెంచుకోవాలన్నారు. సెయిల్ కింద ఉన్న స్టీల్ కంపెనీని కెపాసిటీ పెంచాలని నిర్ణయించిందన్నారు. విశాఖపట్నం విషయంలో మాత్రం ఎవరికో అమ్మేయాలని నిర్ణయించారని ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖ స్టీల్ ను సెయిల్ ఆధ్వర్యంలో ఉంచి.. డెవలప్ చేయాలని జేడీ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. 20 మిలియన్ టన్నుల కెపాసిటీకి పెంచినట్లయితే.. మరో 7 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వొచ్చన్నారు. ఫారెన్ ఇన్వెస్ట్ మెంట్ రూల్స్ ఉన్నాయని, విదేశాల నుంచి డబ్బులు తీసుకురావొచ్చన్నారు. ఆచరణ ఎలా ఉంటుందనేది తర్వాత చూద్దామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ తో తాను మాట్లాడనని చెప్పారు.