JEE మెయిన్ 2026 సెషన్ 1 రిజిస్ట్రేషన్లు షురూ.. సెలబస్ తో సహా ఫుల్ డిటెయిల్స్ ఇవిగో

JEE మెయిన్ 2026 సెషన్  1 రిజిస్ట్రేషన్లు షురూ.. సెలబస్ తో సహా ఫుల్ డిటెయిల్స్ ఇవిగో

JEE మెయిన్​ 2026 ఫస్ట్​ సెషన్​ పరీక్షలకు జనవరి 21 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. పరీక్ష రాయాలనుకునే అభ్యర్థుల కొరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.  నవంబర్​ 27 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.అభ్యర్థులు JEE మెయిన్‌కు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. క్రెడిట్​, డెబిట్​, నెట్​ బ్యాంకింగ్​, యూపీఐ ద్వారా ఫీజు నవంబర్​ 27, 2025 వరకు చెల్లించవచ్చు. పరీక్ష తేదీని జనవరి 2026 మొదటి వారంలో ప్రకటిస్తారు. 

NITలు, IIITలలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో (BE/BTech) ప్రవేశానికి నిర్వహించే JEE  మెయిన్ 2026 సెషన్ 1 పరీక్షలకు దరఖాస్తులు సమర్పించే ప్రక్రియ ప్రారంభమయింది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE మెయిన్) 2026 సెషన్ 1 కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అక్టోబర్ 31న ఆన్‌లైన్ లో దరఖాస్తుల సమర్పణ ప్రారంభమైంది. నవంబర్ 27, 2025న ముగుస్తుంది. 

JEE మెయిన్ 2026 రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. సెషన్ 1 జనవరి 21 నుంచి 30, 2026 వరకు..సెషన్ 2 ఏప్రిల్ 1 నుంచి 10, 2026 వరకు ఉంటుంది. పరీక్షలో పేపర్ 1 ,పేపర్ 2 రెండు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షా ఫలితాలను ఫిబ్రవరి 12, 2026న ప్రకటిస్తారు. 


NITలు, IIITలు, ఇతర కేంద్ర సాంకేతిక సంస్థలు (CFTIలు) ,రాష్ట్ర ప్రభుత్వాలచే  గుర్తింపు పొందిన సంస్థలు అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో (BE/BTech) ప్రవేశానికి JEE మెయిన్ పేపర్ 1,దేశవ్యాప్తంగా BArch ,BPlanning కోర్సులలో ప్రవేశానికి పేపర్ 2 పరీక్ష ఉంటుంది. JEE (మెయిన్) అర్హత సాధించినవారు IITలలో ప్రవేశం కొరకు JEE (అడ్వాన్స్‌డ్) అర్హులు. 

సిలబస్

(JEE) మెయిన్స్ 2025 సిలబస్‌ను కూడా జాయింట్ NIT విడుదల చేసింది. JEE మెయిన్స్ పేపర్ 1 కోసం గణితం సిలబస్‌లో మొత్తం పద్నాలుగు యూనిట్లు ఉంటాయి. భౌతిక శాస్త్రం ,రసాయన శాస్త్రం నుంచి ఒక్కొక్కటి ఇరవై యూనిట్లు ఉంటాయి. 

JEE మెయిన్స్ పేపర్ 2A (BArch) కోసం..పార్ట్ 1 లో గణితం పద్నాలుగు యూనిట్లు, డ్రాయింగ్ ,ఆప్టిట్యూడ్ పరీక్ష కూడా ఉంటుంది. రెండింటి సిలబస్ అధికారిక నోటీసులో సూచించారు. 

జేఈఈ మెయిన్స్‌లో పేపర్ 2బీ బీప్లానింగ్ కోసం మ్యాథమెటిక్స్‌లో మొత్తం పద్నాలుగు యూనిట్లు, ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో మొత్తం రెండు యూనిట్లు, ప్లానింగ్‌లో మొత్తం మూడు యూనిట్లు ఉంటాయి.