జేఈఈ మెయిన్స్ దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

జేఈఈ మెయిన్స్ దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఎన్‌టీఏ నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయాలి. మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశముంటుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ -2024 సెషన్‌-2 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3న ప్రారంభమైంది.

కొత్త అభ్యర్దులతోపాటు మొదటి సెషన్‌ రాసిన విద్యార్థులు మార్చి 2న రాత్రి 11 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. నేడు రాత్రి 11.50 గంటల వరకు మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది.  జేఈఈ మెయిన్-2024 రెండో విడత పరీక్షలను ఏప్రిల్‌ 4 నుంచి ఏప్రిల్ 15 మధ్య నిర్వహించనున్నారు. మార్చి మూడో వారంలో పరీక్ష కేంద్రాల వివరాలను ప్రకటించనున్నారు. అడ్మిట్‌ కార్డులను పరీక్షలకు పరీక్షకు మూడు రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఏప్రిల్‌ 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి.