JEE అభ్యర్థులు ఈ ఆలయానికి క్యూ కడుతుండ్రు

JEE అభ్యర్థులు ఈ ఆలయానికి క్యూ కడుతుండ్రు

రాజస్థాన్ లోని కోట నగరం JEE, NEET కోచింగ్ కు పెట్టింది పేరు.  అక్కడి కోచింగ్ సెంటర్లు ఎంత ఫేమసో.. కోటా నగరానికి సమీపంలోని తల్వండి ప్రాంతంలో ఉన్న రాధా కృష్ణ ఆలయం కూడా అంతే ఫేమస్. ఎందుకంటే.. ఏటా  ఎంతోమంది JEE, NEET అభ్యర్థులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. తమను పాస్ చేయించాలని దేవుణ్ని వేడుకుంటూ ఈ  ఆలయంలోని గోడలపై రాతలు రాస్తుంటారు.

దేవునికి మొక్కుకుంటూ ఈ ఆలయంలోని గోడలపై రాతలు రాసిన పలువురు విద్యార్థులు.. ఇటీవల పరీక్షల్లో ఆశించిన ఫలితాన్ని సాధించారు. దీంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు రాధా కృష్ణ  ఆలయానికి వచ్చి.. తమ పిల్లల మొక్కు తీరిందని చెప్పారు. ఆలయంలోని గోడలపై రాసిన రాతలు నిజమయ్యాయని తెలిపారు. ఆలయానికి తమవంతుగా కొంత విరాళం ఇస్తామని వెల్లడించారు. దీంతో ఈ ఆలయం ప్రాశస్త్యం అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్  టాపిక్ గా మారింది. ప్రతిరోజూ 300 మందికి పైగా విద్యార్థులు ఆలయాన్ని సందర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు.