యువతిని వేధిస్తున్న యువకుడి అరెస్ట్

యువతిని వేధిస్తున్న యువకుడి అరెస్ట్

మేడ్చల్ : స్నేహం ముసుగులో యువతికి దగ్గరైన యువకుడు ఆ తర్వాత దుర్బుద్ధి బయటపెట్టుకున్నాడు. ఇన్స్టా గ్రాంలో వేధింపులకు దిగాడు. యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితున్ని కటకటాల వెనక్కి నెట్టారు.

జీడిమెట్లకు చెందిన యువతికి సూర్యాపేటకు చెందిన సందీప్ చిన్ననాటి స్నేహితురాలు ద్వారా పరిచయమయ్యాడు. ఇన్స్టాగ్రాంలో వారు టచ్లో ఉండేవారు. ఈ క్రమంలో సందీప్ సదరు యువతి ఇన్ స్టా ప్రొఫైల్ పిక్ ను మార్ఫింగ్ చేసి డబ్బులు కావాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. సందీప్ వేధింపులు తాళలేక సదరు యువతి పోలీసులను ఆశ్రయించడంతో జీడిమెట్ల పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.