తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వండి : జీవన్ రెడ్డి

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వండి : జీవన్ రెడ్డి

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి అవకాశం ఇవ్వాలని జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యర్థించారు. కేసీఆర్ పరిపాలనతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నవ్వుల పాలవుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని చెప్పారు. జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై న్యాయ విచారణ జరపాలని.. అప్పుడు కేసీఆర్ కు ఏ గతి పడుతుందో చూడాలన్నారు. కాళేశ్వరం నిర్మాణానికి బాధ్యులైన ప్రతి ఒక్కరూ కటకటాల పాలవుతారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను అధికారం రాగానే అమలు చేస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు.