జగిత్యాల లోని యావర్ రోడ్డు విస్తరణకు నిధులు ఎందుకు తేవడం లేదు :మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల లోని యావర్ రోడ్డు విస్తరణకు నిధులు ఎందుకు తేవడం లేదు :మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డును విస్తరణకు ఎందుకు తేవడం లేదని ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీ లీడర్లతో కలిసి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ప్రజావాణిలో యావర్ రోడ్డులో అక్రమ నిర్మాణాలు, విస్తరణ అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నానన్న స్థానిక ఎమ్మెల్యే.. యావర్​ రోడ్డు విస్తరణకు నిధులు ఎందుకు తీసుకురావడంలేదని విమర్శించారు. 

నిధులు తీసుకురాకుండా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం ఇవ్వడం ప్రజలను మభ్యపెట్టడమేనని మండిపడ్డారు. పట్టణ నడిబొడ్డున సర్వే నంబర్ 138లోని మున్సిపల్ స్థలాన్ని, యావర్ రోడ్డులోని ఆక్రమించుకుంటే అధికారులు పట్టించుకోవడం లేదని, కానీ రోడ్డుపక్కన బతికే చిరువ్యాపారులపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.