నీట్ పేపర్​లీక్​ కేసులో జర్నలిస్ట్​ అరెస్ట్

నీట్ పేపర్​లీక్​ కేసులో జర్నలిస్ట్​ అరెస్ట్
  •     జార్ఖండ్​లో అరెస్టు చేశాం: సీబీఐ
  •     గుజరాత్​లో విస్తృత సోదాలు
  •     నలుగురు నిందితులకు సీబీఐ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు

అహ్మదాబాద్: నీట్​యూజీ–2024 పేపర్​లీక్​ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ జర్నలిస్టును జార్ఖండ్​లోని హజారీబాగ్​లో శనివారం అదుపులోకి తీసుకున్నది. ఓ హిందీ న్యూస్‌‌‌‌ పేపర్‌‌‌‌లో పనిచేసే జమాలుద్దీన్ అనే జర్నలిస్ట్‌‌‌‌ పేపర్‌‌‌‌ లీకేజీలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్‌‌‌‌, వైస్‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌కు సాయం చేశారనే అభియోగాలతో సీబీఐ అతడిని అరెస్ట్​ చేసింది. ఇప్పటికే ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్‌‌‌‌ ఎహసానుల్ హక్, వైస్‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌ ఇంతియాజ్ ఆలంను కేంద్ర దర్యాప్తు సంస్థ శుక్రవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హజారీబాగ్​లో నీట్‌‌‌‌ పరీక్ష నిర్వహణకు స్థానిక ఒయాసిస్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌ ఎహ్‌‌‌‌సానుల్‌‌‌‌ కోఆర్డినేటర్​గా వ్యవహరించారు. వైస్‌‌‌‌ ప్రిన్సిపాల్‌‌‌‌ ఇంతియాజ్‌‌‌‌ ఆలం ఎన్టీఏ అబ్జర్వర్, ఒయాసిస్‌‌‌‌ స్కూల్‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఎగ్జామ్​ సెంటర్​ కోఆర్డినేటర్​గా వ్యవహరించారని సీబీఐ అధికారులు వెల్లడించారు.

గుజరాత్​లో నలుగురికి సీబీఐ కస్టడీ

గుజరాత్‌‌‌‌లో అరెస్టయిన నలుగురు నిందితులకు పంచమహల్​ కోర్టు శనివారం సీబీఐ కస్టడీ విధించింది. వీరిలో స్కూల్ టీచర్​తుషార్ భట్, జై జలరామ్​ స్కూల్ ప్రిన్సిపాల్ పురుషోత్తంశర్మ, మధ్యవర్తులు విభోర్ ఆనంద్, ఆరిఫ్ వోహ్రాను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టినప్పటికీ, తాజా దర్యాప్తు కోసం తమ కస్టడీ అవసరమని సీబీఐ తరఫు న్యాయవాది ధ్రువ్ మాలిక్ కోర్టుకు తెలిపారు. దీంతో నలుగురిని జులై 2 వరకు  సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ పంచమహల్​ కోర్టు ప్రిన్సిపల్​ డిస్ట్రిక్ట్​ జడ్జి సీకే చౌహాన్​ తీర్పు చెప్పారు. కాగా, శనివారం సీబీఐ బృందాలు గుజరాత్‌‌‌‌లోని ఏడు వేర్వేరు ప్రాంతాల్లో  సెర్చ్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌ నిర్వహించాయి.