క్రికెట్‌‌‌‌‌‌‌‌కు షాబాజ్‌‌‌‌‌‌‌‌ నదీమ్‌‌‌‌‌‌‌‌ గుడ్‌‌‌‌‌‌‌‌బై

క్రికెట్‌‌‌‌‌‌‌‌కు షాబాజ్‌‌‌‌‌‌‌‌ నదీమ్‌‌‌‌‌‌‌‌ గుడ్‌‌‌‌‌‌‌‌బై

కోల్‌‌‌‌‌‌‌‌కతా: జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ షాబాజ్‌‌‌‌‌‌‌‌ నదీమ్‌‌‌‌‌‌‌‌.. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌బై చెప్పాడు. అయితే ఫ్రాంచైజీ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. యంగ్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లకు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియాకు ఆడే చాన్స్‌‌‌‌‌‌‌‌ రావడం కష్టమే. నేను సెలెక్టర్ల ప్లాన్స్‌‌‌‌‌‌‌‌లో లేనని తెలిసిపోయింది. 

దాంతో పాటు చాలా మంది యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌ చాన్స్‌‌‌‌‌‌‌‌ కోసం వేచి చూస్తున్నారు. నేను రేస్‌‌‌‌‌‌‌‌లో ఉండటం వల్ల వాళ్లకు అడ్డంకిగా మారదల్చుకోలేదు. అందుకే వీడ్కోలు పలికా. ప్రపంచ వ్యాప్తంగా జరిగే లీగ్‌‌‌‌‌‌‌‌ల్లో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటా’ అని నదీమ్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. ఇండియా తరఫున రెండు టెస్ట్‌‌‌‌‌‌‌‌లు ఆడిన షాబాజ్‌‌‌‌‌‌‌‌ 8 వికెట్లు తీశాడు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో 542 వికెట్లు పడగొట్టాడు.