‘జిగ్రీస్’ చిత్రం నటుడిగా తనలో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని కృష్ణ బూరుగుల అన్నాడు. తను లీడ్‌గా నటించిన ఈ సినిమా ఈనెల 14న విడుదలై మంచి స్పందన దక్కించుకుంది.
ఈ సందర్భంగా కృష్ణ బూరుగుల మాట్లాడుతూ ‘రవిబాబు గారు డైరెక్ట్ చేసిన ‘క్రష్’ మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చాను. తర్వాత ‘మానాన్న నక్సలైట్’, డైరెక్టర్ హరీష్ శంకర్ షో రన్నర్‌గా చేసిన ‘ATM’ వెబ్ సిరీస్, ‘కృష్ణమ్మ’ చిత్రంలో నటించాను.
ఈ సినిమాలన్నీ నటుడిగా నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చినవే. ‘జిగ్రీస్’ విషయానికి వస్తే.. నాది రగ్డ్, చిచోరే పాత్ర. నా రియల్ లైఫ్‌కు పూర్తి భిన్నమైన క్యారెక్టర్. నా పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారు కూడా సినిమా చూసి చాలా బాగా చేశానని అప్రిషియేట్ చేశారు. ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు.
ఈ చిత్రం నాకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా. త్వరలోనే ఓ సినిమా స్టార్ట్ చేస్తా. ఎన్ని సినిమాలు చేశామనేది కాదు.. ఎలాంటి పాత్ర చేశామని.. యాక్టర్‌గా నా ఇంపాక్ట్ ఉండేలా చూసుకుంటా’ అని చెప్పాడు.
