చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఆంక్షలు కఠినం

చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఆంక్షలు కఠినం

బీజింగ్ : కరోనా పుట్టినిల్లైన చైనాలో కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే చంగ్ చున్ నగరంలో లాక్ డౌన్ విధించగా.. తాజాగా చైనా ఈశాన్య ప్రాంతంలోని జిలిన్ సిటీలో ఆంక్షలు కఠినతరం చేశారు. జిలిన్ ప్రావిన్స్లోని రెండో అతిపెద్ద నగరమైన జిలిన్లో లాక్డౌన్ విధించారు. దాదాపు 45లక్షల జనాభా కలిగిన సిటీలో సోమవారం రాత్రి నుంచి 3 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిలిన్ ప్రావిన్స్లో 8 టెంపరరీ హాస్పిటళ్లు, 2 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 

గత రెండేళ్లుగా చైనా లాక్డౌన్,  మాస్ టెస్టింగ్, ట్రావెల్ రిస్ట్రిక్షన్స్తో కొవిడ్ మహమ్మారి మరింత ప్రబలకుండా అడ్డుకుంది. ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినా ఒమిక్రాన్ వేరియెంట్ మాత్రం పలు నగరాల్లో చాపకింద నీరులా విస్తరించింది. చైనాలో ఆదివారం 4000 కొత్త కేసులు నమోదుకాగా.. వాటిలో రష్యా, నార్త్ కొరియా బార్డర్లోని జిలిన్ ప్రావిన్స్లోనే మూడింట రెండొంతులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నియంత్రణ కోసం 90లక్షల జనాభా కలిగిన చంగ్ చున్లో మార్చి 11 నుంచి  కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లేందుకు రెండు రోజులకు ఒకసారి మాత్రమే అనుమతిస్తున్నారు. దాదాపు ఏడాది తర్వాత శనివారం కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తల కోసం..

ధనుష్కోడి బీచ్లో అద్భుత దృశ్యం

తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య