యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ , కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో పర్యటించారు. వీరిద్దరి పర్యటన వేర్వేరుగా సాగింది. స్లొవేకియా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉఝొరొడ్ సిటీకి వచ్చిన జిల్ బైడెన్ అక్కడ రెండు గంటల పాటు గడిపారు. ఓ చిన్న క్లాస్ రూంలో ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలేనా జెలెన్ స్కీ తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ తల్లులకు సంఘీభావం తెలిపేందుకే ప్రత్యేకంగా మాతృ దినోత్సవం రోజున అక్కడికి వచ్చినట్లు తెలిపారు జిల్. ఒలేనా తో జిల్ చర్చల వివరాలేవీ బయటకు రాలేదు. తూర్పు ఐరోపాలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జిల్ శుక్ర, శనివారాల్లో రొమేనియాలో ఉన్నారు. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఉక్రెయిన్ లోని ఇర్పిన్ సిటీలో పర్యటించారు. కీవ్ ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా రష్యా బలగాలు ఆ నగరాన్ని ఎంతగా ధ్వంసం చేశాయో పరిశీలించారు.
మరిన్ని వార్తల కోసం
