జియో వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో ₹147 నుంచి ప్రారంభమై ₹1,748 వరకు ఆరు రీఛార్జ్ ఆప్షన్స్‌ను తీసుకొచ్చింది. జియో వాయిస్ ఓన్లీ ప్లాన్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ 147 రూపాయల ప్లాన్ గురించి.
రూ.147 వాయిస్ ఓన్లీ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 SMSలు, 22 రోజుల వ్యాలిడిటీతో పొందొచ్చు. ఇంట్లో, ఆఫీస్‌లో Wi-Fiపై ఆధారపడే జియో ప్రీపెయిడ్ కస్టమర్స్ ఈ ప్లాన్ ట్రై చేయొచ్చు. 177 రూపాయల ప్లాన్‌తో 28 రోజులు వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, 300SMSలు పొందొచ్చు.
30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కావాలంటే 196 రూపాయలతో, క్యాలెండర్ నెల వ్యాలిడిటీ ప్లాన్ పొందాలనుకుంటే 197 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 448 రూపాయల వాయిస్ ఓన్లీ ప్లాన్ 84 రోజులతో ఇప్పటికే అందుబాటులో ఉంది. రూ.1,748 వాయిస్ ఓన్లీ ప్లాన్ కూడా 336 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వాయిస్ -ఓన్లీ ప్లాన్లలో దేనిలోనూ మొబైల్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు.
►ALSO READ | ఆలోచనలతోనే కంప్యూటర్లను కంట్రోల్ చేసే టెక్నాలజీ.. ఎలాన్ మస్క్ 'టెలిపతి' ప్రత్యేకతలు ఇవే
