రూ. 750 ప్లాన్.. ఇక రూ.749.. ఏం మారింది ?

రూ. 750 ప్లాన్.. ఇక రూ.749.. ఏం మారింది ?

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం గత నెలలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. రూ. 750 ప్రీ పెయిడ్ ప్లాన్ తో  అన్‌లిమిటెడ్ కాల్స్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు, 2 జీబీ రోజువారీ డేటాను 90 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఈ ప్లాన్ టాప్ ట్రెండింగ్ జియో రీఛార్జ్ ప్యాక్‌లలో ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పుడు జియో ఈ ప్లాన్‌ను సవరించింది. ఈ ప్లాన్ ధరను ఒక్క రూపాయి తగ్గించి రూ.749కి చేర్చింది.  పాత ప్లాన్ (రూ.750) తరహాలో.. అన్ని బెనిఫిట్స్ కొత్త ప్లాన్ (రూ.749)లోనూ లభిస్తాయి. అయితే సవరించిన ప్లాన్ లో ఒక్క రూపాయిని తగ్గించినందుకుగానూ డేటాలో 100 ఎంబీ కోత విధించింది. రూ.750 ప్లాన్ కు వినియోగదారుడు ప్రతిరోజూ రూ.8.33 చొప్పున చెల్లించాల్సి వచ్చేది. సవరించిన రీచార్జ్ ప్లాన్ రూ.749లో వినియోగదారుడు ప్రతిరోజూ రూ.8.32 మాత్రమే చెల్లించాల్సి వస్తోంది. వినియోగదారుడు రీచార్జ్ కోసం చెల్లించే వ్యయం తగ్గినందున, అందుకు అనుగుణంగా రూ.749 ప్లాన్ లో 100 ఎంబీ డేటాను జియో తగ్గించేసింది. 

రూ.749 ప్లాన్ ప్రయోజనాలు

జియో కొత్త రూ.749 ప్రీపెయిడ్ ప్లాన్  వ్యాలిడిటీ 90 రోజులు. మొత్తం 180 GB డేటా పొందొచ్చు. రోజువారీ 2GB హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS లు, జియో టీవీ, జియో సినిమా , జియో సెక్యూరిటీతో సహా అన్ని జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తాయి.