జియో న్యూఇయర్ ఆఫర్స్ ఇలా...

జియో న్యూఇయర్ ఆఫర్స్ ఇలా...

నూతన సంవత్సరం రాబోతోంది. ఈ సందర్భంగా రిలయన్స్ జియో భారతదేశం అంతటా ప్రీపెయిడ్ యూజర్ బేస్ కోసం 'హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024' పేరుతో ఓ కొత్త రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇది ఇంతకుముందున్న వార్షిక కాల పరిమితితో పనిచేసే రీఛార్జ్ ప్లాన్ రూ.2,999పై అదనపు వ్యాలిటీని అందిస్తోంది. దీని వల్ల యూజర్స్ కు 24రోజుల ఎక్స్ ట్రా వ్యాలిడిటీ లభిస్తుంది.

ప్లాన్ వివరాలు

న్యూ ఇయర్ ఆఫర్ లో భాగంగా జియో తీసుకువచ్చిన తాజా ఆఫర్ ప్రకారం, రూ. 2,999 దీర్ఘ-కాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ పై 24-రోజులు అదనంగా వ్యాలిడిటీ ఇస్తుంది. అంటే ప్లాన్ వ్యవధి 365రోజులైతే.. ఇది దానికి మరో 24రోజులు పొడిగింపును అందిస్తుంది. అంటే దీని వల్ల మొత్తం 389 రోజులు ఈ ప్లాన్ తో ఎంజాయ్ చేయొచ్చు. కస్టమర్‌లు ఈ ప్లాన్‌ని Jio ప్రీపెయిడ్ ప్లాన్ వెబ్‌పేజీ లేదా MyJio అప్లికేషన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ప్రయోజనాలు

తాజా ఆఫర్ ప్రకారం, రోజుకు రూ.8.21పడే ప్లాన్ ధర ఇప్పుడు రూ.7.70లకు తగ్గుతుంది. రోజుకు 2.5జీబీ అన్ లిమిటెడ్ 4జీ డేటా, అన్ లిమిటెడ్ 5జీ డేటా, వాయిస్ కాల్స్, 100ఎస్ఎంస్ లు అందిస్తోంది. వీటితో పాటు జియో క్లౌడ్, జియ టీవీ, జియో సినిమా వంటి జియో యాప్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. జియో న్యూ ఇయర్ ప్లాన్ ప్రయోజనాలు డిసెంబర్ 20 తర్వాత నుంచి రీఛార్జ్ చేసుకున్న వారికే వర్తిస్తాయి. కాగా దీనిపై చివరి తేదీ ఆ కంపెనీ ఇంకా వెల్లడించలేదు.