భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​గా జితేశ్​వి పాటిల్

భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​గా జితేశ్​వి పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​గా జితేశ్​ వి పాటిల్​ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. రానున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన శనివారం కలెక్టర్​ ప్రియాంక అలను ప్రభుత్వం ట్రాన్స్​ ఫర్​ చేసింది. ఆమెకు ఇంకా ఎక్కడా పోస్టింగ్​ ఇవ్వలేదు. ప్రియాంక అల గతేడాది జూలై 15న కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టారు. జాయిన్​ అయిన తేదీనే ఆమెకు ట్రాన్స్​ ఫర్​ ఉత్తర్వులు రావడం గమనార్హం.

ఇంతకాలం జిల్లాలో గోదావరి వరదలు రావడం, వరదల్లో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా సిబ్బందితో పనిచేయించడంలో ఆమె సక్సెస్​ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు.

కాగా ఇప్పటి వరకు కామారెడ్డి కలెక్టర్​గా పనిచేసిన జితేశ్​ వి పాటిల్​మహారాష్ట్రకు చెందిన 2016 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్​ ఆఫీసర్. గతంలో ఆయన నిజామాబాద్​ కార్పొరేషన్​ కమిషనర్​గా కూడా పనిచేశారు. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఆయన కలెక్టర్​గా బాధ్యతలు నిర్వహించనున్నారు.