సరిహద్దుల్లో పాక్ కుట్రను భగ్నం చేసిన బీఎస్ఎఫ్

సరిహద్దుల్లో పాక్ కుట్రను భగ్నం చేసిన బీఎస్ఎఫ్

62 కిలోల హెరాయిన్ పట్టుకున్న బీఎస్‌‌ఎఫ్‌

జమ్మూ: మన దేశంలోకి డ్రగ్స్, వెపన్స్ ను స్మగ్లింగ్ చేయాలని పాక్ చేసిన కుట్రను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) భగ్నం చేసింది. జమ్మూకాశ్మీర్ లో బార్డర్ వెంబడి కొందరు పాకిస్తానీయులు డ్రగ్స్, వెపన్స్ ను మన దేశంలోకి పంపేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకుంది. ‘‘ఆర్ఎస్ పురా సెక్టార్ లోని ఆర్నియా ఏరియాలో తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో పాకిస్తాన్ సైడ్ కొంతమందిని గుర్తించాం. వారిలో ముగ్గరు బార్డర్ కు దగ్గరగా వచ్చారు. అప్రమత్తమైన జవాన్లు కాల్పులు జరపడంతో వారు డ్రగ్స్, వెపన్స్ వదిలేసి పారిపోయారు” అని బీఎస్ఎఫ్​ఐజీ ఎన్ఎస్ జమ్వాల్ తెలిపారు. 62 కిలోల హెరాయిన్, రెండు చైనా పిస్తోళ్లు, మూడు మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఒక్కోటి కిలో చొప్పున 62 హెరాయిన్ ప్యాకెట్లు, వెపన్స్​ను ప్లాస్టిక్ బ్యాగ్స్ లో ఉంచి.. పీవీసీ పైపు ద్వారా మన సైడ్ జారవిడిచే ప్రయత్నం చేశారన్నారు. పట్టుకున్న హెరాయిన్ విలువ ఇంటర్నేషనల్ మార్కెట్​లో దాదాపు300 కోట్లు ఉంటుందని చెప్పారు. పాకిస్తాన్ నార్కో టెర్రరిజమ్ కు పాల్పడుతోందని, రెండేండ్లలో చాలాసార్లు ఆ దేశ కుట్రలను అడ్డుకున్నామని తెలిపారు.

బంకర్లలో దాక్కుంటున్న టెర్రరిస్టులు.. 

టెర్రరిస్టులు రూట్ మార్చారు. ఆర్మీ కంటపడకుండా అండర్ గ్రౌండ్ బంకర్లలో దాక్కుంటున్నారు. జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో వీటిని ఆలస్యంగా గుర్తించామని కల్నల్ ఏకే సింగ్ తెలిపారు. ఈ బంకర్లు చాలా వరకూ యాపిల్ తోటలు, అడవుల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. రాంబీ ఆరా నది మధ్యలో టెర్రరిస్టులు ఏర్పాటు చేసుకున్న ఐరన్ బంకర్ ను ఈ ఏడాది మొదట్లో గుర్తించి, ఐదుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టామని తెలిపారు. షోపియాన్ జిల్లాలోని లాబీపొరా ప్రాంతంలో నది ఒడ్డున అండర్ గ్రౌండ్ బంకర్ నిర్మించిన టెర్రరిస్టులు బ్రీతింగ్ కోసం పైపును ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఇంకా చాలా బంకర్లు ఉన్నాయని వాటన్నింటినీ గుర్తించి ధ్వంసం చేస్తామని ఏకే సింగ్ చెప్పారు.