జమ్ముకు ఈ నెల 25న సెక్రటేరియట్ తరలింపు

జమ్ముకు ఈ నెల 25న సెక్రటేరియట్ తరలింపు

జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వం ఆరు నెలలు శ్రీనగర్‌లోనూ, ఆరు నెలలు జమ్ములోనూ సెక్రటేరియట్ ను ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఏడాదిలో రెండు ప్రాంతాలలో రాజధానులను నిర్వహిస్తారు. ప్రస్తుతం శ్రీనగర్‌లో ఉన్న సచివాలయాన్ని జమ్ముకు తరలించే ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ నెల 25నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్‌ 4వ తేదీన జమ్ములో ప్రభుత్వం తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీనిలో భాగంగా సెక్రటేరియట్, రాజ్‌భవన్‌ను జమ్ముకు తరలించనున్నారు అధికారులు. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత మొదటి సారిగా ప్రభుత్వం తరలింపును ప్రక్రియ చేపడుతోంది. ఈ నెల 31వ తేదీన జమ్ము కశ్మీర్‌, లడఖ్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడనుండటంతో GDA, హోంశాఖ, ప్రోటోకాల్‌, ఎస్టేట్స్‌, ఐటి, ఇన్మర్మేషన్‌ విభాగాలకు కొంతమంది అధికారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడే ప్రక్రియ కోసం వారు శ్రీనగర్‌లోనే ఉండనున్నారు.