వాణిజ్య వాహనాల కోసం ప్రత్యేక టైర్లు..లాంచ్​ చేసిన జేకే టైర్

వాణిజ్య వాహనాల కోసం ప్రత్యేక టైర్లు..లాంచ్​ చేసిన జేకే టైర్

హైదరాబాద్ : జేకే టైర్ వాణిజ్య వాహనాల కోసం  కొత్త టైర్లను హైదరాబాద్​లో ప్రారంభించింది. వీటిలో జెట్​వేజేయూఎం ఎక్స్​ఎం, జెట్​వే జేయూసీ ఎక్స్​ఎం, జెట్​స్టీల్​జేడీసీ ఎక్స్​డీతోపాటు ఎలక్ట్రిక్ బస్సుల కోసం తయారుచేసిన జెట్​వేజేయూఎక్స్​ఈ టైర్లు ఉన్నాయి.  ఇవి ఎక్కువ మైలేజ్​ను ఇస్తాయని, తక్కువ శబ్దం చేస్తాయని తెలిపింది. వీటి తయారీకి జెట్​ఓటీసీ టెక్నాలజీ వాడటం వల్ల ఇతర కంపెనీల టైర్లతో పోలిస్తే జీవిత కాలం పదేళ్లు

 మన్నిక 40 శాతం ఎక్కువ ఉంటుందని తెలిపింది. వీటిని టిప్పర్లు,  ట్రైలర్లకు, బస్సుల కోసం తయారు చేశామని జేకే టైర్ అండ్​ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రెసిడెంట్ (ఇండియా)  అనుజ్ కథూరియా తెలిపారు. మనదేశంలో ప్రతి నెలా  6 లక్షల టైర్లు తయారవుతున్నాయని, తాము 500 రకాల టైర్లు అమ్ముతున్నామని చెప్పారు. మైసూరు ప్లాంటు విస్తరణకు రూ.1,400 కోట్లు ఖర్చు చేస్తామని కథూరియా వెల్లడించారు.