ఖమ్మం జిల్లాలో రేపు (డిసెంబర్ 24న) జాబ్ మేళా

ఖమ్మం జిల్లాలో రేపు (డిసెంబర్ 24న) జాబ్ మేళా

ఖమ్మం టౌన్, వెలుగు: జిల్లాలోని నిరుద్యోగ యువతకు భారత్ హ్యుందాయ్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు బుధవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం టీటీడీసీ భవనంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ ఒక ప్రకటన లో తెలిపారు. ఖమ్మం, మధిరలో ఫీల్డ్ సేల్స్ కన్సల్టెంట్స్, సర్వీస్ అడ్వైజర్, షోరూం సేల్స్ కన్సల్టెంట్స్, అకౌంట్ ఎగ్జిక్యూటివ్స్, రిసెప్షని స్ట్. సీఆర్ , సేల్స్ టీం లీడర్స్, సేల్స్ మేనేజర్ పోస్టులున్నాయన్నారు. 

ఏదైనా డిగ్రీ అర్హత గల 24 నుంచి 35 ఏండ్ల వయసువారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం, ఇన్సెం టివ్స్ ఉంటాయని తెలిపారు. విద్యార్హతల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో జాబ్ మేళాకు హాజరు కావాలని, ఇతర వివరాలకు 70369 02902 ఫోన్నంబర్లో సూచించారు. సంప్రదించాలని