5 వేల 369 ఉద్యోగాలకు SSC నోటిఫికేషన్...

5 వేల 369 ఉద్యోగాలకు SSC నోటిఫికేషన్...

సెంట్రల్ గవర్నమెంట్ పర్సనల్, మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్ కు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ఎసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ‘సెలక్షన్ పోస్టు’ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విభాగాల్లో మొత్తం 5369 పోస్టులకు దరకాస్తులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులకు పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఎలిజిబిలిటీ ఉంటుందని తెలిపింది. 

పోస్టులు: ఇన్వె్స్టిగేటర్ గ్రేడ్-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, హిందీ టైపిస్టు, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, టెక్స్ టైల్ డిజైనర్, ప్లానింగ్ అసిస్టెంట్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ కమ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్ మన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్, నేవిగేషనల్ అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత అయి ఉండాలి. 

వయసు: 18- 30 ఏళ్ల వయసు కలిగిన వాళ్లై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: స్కిల్ టెస్టు, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, డేటా ఎంట్రీ టెస్ట్, కంప్యూటర్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా
చివరి తేదీ: మార్చి 27
వెబ్ సైట్ : ssc.nic.in