జాబ్స్ పెరుగుతున్నయ్.. నిరుద్యోగం తగ్గుతుంది

జాబ్స్ పెరుగుతున్నయ్.. నిరుద్యోగం తగ్గుతుంది
  • లాక్‌‌డౌన్‌‌ రిస్ట్రిక్షన్లు తగ్గుతుండడమే కారణం

న్యూఢిల్లీ: పరిస్థితులు కొద్దిగా చక్కబడ్డాయి. దేశమంతటా ఇప్పుడు అనెంప్లాయ్మెంట్ రేటు (నిరుద్యోగం) ఆరు వారాల్లో అత్యంత తక్కువగా.. అంటే 8.7 శాతంగా నమోదయ్యింది. కరోనా వైరస్ కేసులు పడిపోవటం వల్ల రాష్ట్రాలు లాక్‌‌డౌన్‌‌లను /రిస్ట్రిక్షన్లను తొలగిస్తున్నాయి.  ఇన్‌‌ఫార్మల్‌‌ సెక్టార్లో కార్యకలాపాలపై రిస్ట్రిక్షన్లను సడలించడం వల్లే రికవరీ కనిపిస్తోందని ఎకనమిస్టులు అంటున్నారు. ఇప్పటికీ జాబ్ కట్స్ కొనసాగుతున్నాయని చెప్పారు.
ఈ ఏడాది జూన్ 13 తో ముగిసిన వారంలో పట్టణాల్లో నిరుద్యోగం 9.7 శాతానికి పడిపోయింది. ఇదే ఏడాది మే నెలలో నెలవారీ నిరుద్యోగిత రేటు 14.7 శాతంగా రికార్డయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఈఈ) తెలిపింది. మునుపటి వారాలతో పోల్చితే ఇది మరింత తక్కువగా ఉంది. ఈ ఏడాది మే 30 తో ముగిసిన వారంలో పట్టణ నిరుద్యోగిత రేటు 17.88 శాతం కాగా, ఇది గత వారం 8.18 శాతం కంటే తక్కువగా రికార్డయింది.  అంతకుముందు వారంతో పోలిస్తే 3.6 శాతం పాయింట్లు తక్కువగా ఉంది. 

గ్రామాల్లో పరిస్థితి ఇలా..
పల్లెటూళ్లలో ఈ నెల 13 తో ముగిసిన వారంలో జాబ్‌‌లాస్ రేటు 8.23 శాతానికి చేరుకుంది. మే  నెలలో ఇది 10.63 శాతంగా ఉంది. సీఎంఐఈ డేటా ప్రకారం, మే నెలలో జాతీయ నిరుద్యోగిత రేటు దాదాపు 12 శాతం ఉంది. అయితే, జనవరి– ఏప్రిల్ మధ్య ఉన్న నెలవారీ నిరుద్యోగిత రేట్ల కంటే తాజా అనెంప్లాయ్మెంట్ రేటు ఇప్పటికీ ఎక్కువగా ఉంది. అప్పుడు ఇది 6.52శాతం –7.97శాతం మధ్య ఉంది.  అనెంప్లాయ్మెంట్ రేటు ఏప్రిల్‌‌లో 7.97శాతం  ఉండటంతో 34  లక్షల మంది శాలరీడ్ ఎంప్లాయిస్ జాబ్స్ కోల్పోయారు. ఇదేకాలంలో మొత్తం 73.5 లక్షల మంది జాబ్స్‌కు దూరమయ్యారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్న 2020 ఏప్రిల్‌‌లో జాతీయ అనెంప్లాయ్మెంట్ రేటు 23.52 శాతానికి చేరుకుంది.  ఈ ఏడాది జనవరిలో ఇది 6.52 శాతానికి పడిపోయింది. అయితే, సెకండ్ వేవ్ వల్ల ఏప్రిల్– మే నెలల్లో ఉద్యోగాల మార్కెట్‌‌ మళ్లీ తగ్గింది. ఈ రెండు నెలల్లో దాదాపు 2.3 కోట్ల మంది జాబ్స్ పోయాయి. వీరిలో శాలరీడ్, నాన్–శాలరీడ్ ఉద్యోగాలు ఉన్నాయి. 

అత్యవసరమైతేనే కొంటున్నరు..
మెడికల్, పెట్రోల్, డీజిల్ భారం పెరగడంతో చాలా మంది అత్యవసర వస్తువులు మాత్రమే కొంటున్నారని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. చాలాకాలం లాక్‌డౌన్లు ఉండటం కస్టమర్ సెంటిమెంట్ బలహీనంగా ఉందని తెలిపింది.  టీకా కవరేజ్ ఇంకా వేగవంతమైతే, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రేటు 9.5శాతం వరకు ఉండవచ్చునని ఈ రేటింగ్ సంస్థ అంచనా వేసింది. సీఎంఐఈ డేటా ప్రకారం.. ఈ నెల 13 తో ముగిసిన వారంలో జాతీయ కార్మిక శక్తి పార్టిసిపేషన్ 39.75శాతంగా ఉంది. 

ఇన్ఫార్మల్ సెక్టార్లో కదలిక..
చాలా రాష్ట్రాలు లాక్‌‌‌‌డౌన్లను  క్రమంగా సడలించడం వల్ల ఇన్‌‌‌‌ఫార్మల్ సెక్టార్లోని కార్మికులకు చిన్న వ్యాపారవేత్తలు తిరిగి పని ఇచ్చారని మార్కెట్ ఎక్స్‌‌పర్టులు చెప్పారు.  ఫార్మల్ సెక్టార్ మాత్రం ఇంకా కష్టపడుతూనే ఉంది. డిమాండ్ పెరగడం, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ సాధారణస్థాయి రావడం, ఎకానమీ రికవరీ సాధ్యపడితే ఫార్మల్ సెక్టార్ ఉద్యోగులకు పనిదొరుకుతుందని అంటున్నారు. “అనెంప్లాయ్మెంట్ రేటు తగ్గుదల గురించి ఇప్పుడే అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. గత వారంలో వర్షాలు మొదలవడంతో మార్కెట్లు కొద్దిగా పుంజుకున్నాయి. రుతుపవనాల వల్ల పట్టణ లేబర్ మార్కెట్‌‌‌‌కు పెద్దగా ఒరిగేదీ ఏమీ ఉండదు కానీ గ్రామాల్లో సాగు హడావుడి మొదలవుతుంది. దీనివల్ల చాలా మంది కూలిపని దొరుకుతుంది”అని ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్ అరుప్ మిత్రా అన్నారు.  ఫార్మల్ సెక్టార్లో సాధారణ లేదా పర్మనెంట్ కార్మికులకు సెకండ్ వేవ్లో పెద్దగా సమస్యలు రాలేదు. కానీ ఈ సెక్టార్లోని టెంపరరీ కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. ‘‘ఈ వర్గాల కార్మికులు సొంతూళ్లకు తిరిగి వెళ్లారు లేదా మంచి అవకాశాలు లేకపోవడం వల్ల కార్మిక మార్కెట్‌కు దూరమయ్యారు. అందుకే అనెంప్లాయ్మెంట్ రేటు తగ్గినట్టు కనిపిస్తోంది ”అని మిత్రా వివరించారు. ఫార్మల్ సెక్టార్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్, మార్కెట్ డిమాండ్, ఎకానమీ మామూలుస్థాయికి వస్తేనే ఫలితాలు కనిపిస్తాయని స్పష్టం చేశారు. ‘‘ఎకానమీ ఇంకా కష్టపడుతోంది. కస్టమర్ల  సెంటిమెంట్ ఇప్పటికీ బలంగా లేదు.  ఫార్మల్ సెక్టార్ రికవరీకి ఈ రెండూ చాలా ముఖ్యం” అని చెప్పారు.