టిక్‌టాక్‌పై బ్యాన్ ఎత్తేసిన అమెరికా

V6 Velugu Posted on Jun 10, 2021

చైనా యాప్ టిక్‌టాక్ విషయంలో అమెరికా వెనక్కి తగ్గింది. టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలన్న మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాలను ఉపసంహరించుకుంది. టిక్‌టాక్, వీ చాట్‌తో పాటు మరో 8 యాప్‌ల బ్యాన్‌ను ప్రెసిడెంట్ జో బైడెన్ వెనక్కి తీసుకున్నారు. అంతేకాకుండా వివాదస్పదంగా ఉన్న చైనా యాప్‌ల విషయంలో కొత్త గైడ్ లైన్స్ కూడా జారీ చేశారు. చైనా యాప్స్ పర్సనల్ డేటాను కలెక్ట్ చేస్తున్నాయని గతంలో ఆరోపణలొచ్చాయి. ఈ పరిణామం దేశ రక్షణకు ప్రమాదాన్ని కలిగిస్తుందనే హెచ్చరికలతో అప్పట్లో ట్రంప్ వీటిపై బ్యాన్‌కు ఆర్డర్సిచ్చారు. ఆ ఆదేశాలను మారుస్తూ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. టిక్‌టాక్ సహా వివాదస్పద చైనా యాప్‌లపై మరింత లోతైన దర్యాప్తు చేయాలని అధికారుల్ని ఆదేశించారు.

Tagged america, Donald Trump, TikTok, Joe Biden, China Apps, WeChat,

Latest Videos

Subscribe Now

More News