చైనాకు సారీ చెప్పేదే లేదు: బైడెన్

చైనాకు సారీ చెప్పేదే లేదు: బైడెన్

అమెరికా -చైనా మధ్య నెలకొన్న స్పై బెలూన్‌ వివాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. స్పై బెలూన్‌ను కూల్చిన ఘటనలో చైనాకు క్షమాపణలు చెప్పేది లేదని స్పష్టం చేశారు. అమెరికా ప్రజల ప్రయోజనాలు, దేశ భద్రతకే మొదటి ప్రాధాన్యం అని బైడెన్ వెల్లడించారు. స్పై బెలూన్ వివాదంపై త్వరలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్తో మాట్లాడే అవకాశం ఉందన్నారు. చైనాతో తాము ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు. 

అమెరికా గగనతలంలో చక్కర్లు కొడుత్ను చైనా నిఘా బెలూన్‌ను అమెరికా యుద్ధ విమానాలు కూల్చేశాయి. గూఢచర్య బెలూన్‌ అని భావించిన అమెరికా..యుద్ధ విమానాన్ని పంపించి  అట్లాంటిక్‌ మహా సముద్రంలో కూల్చివేసింది.  బెలూన్ కూలిన ప్రదేశంలో సెన్సర్లు.. ఎలక్ట్రానిక్ పరికరాలను గుర్తించినట్లు యూఎస్‌ వెల్లడించింది. అమెరికా ఆరోపణలను చైనా ఖండించింది. బెలూన్ ను వాతావరణ అధ్యయనం కోసం ప్రయోగించినట్లు స్పష్టం చేసింది. ఈ ఘటన రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి.