గెలుపు మనదే.. 300 ఓట్లతో నెగ్గుతాం

గెలుపు మనదే.. 300 ఓట్లతో నెగ్గుతాం

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా పూర్తి ఫలితాలు వెలువడలేదు. ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే ఇప్పటికి వచ్చిన రిజల్ట్స్ ప్రకారం.. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై స్పష్టమైన మెజారిటీతో ఉన్నారు. బైడెన్‌‌ 264 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ట్రంప్ 214 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. మ్యాజికల్ నంబర్ అయిన 270కు బైడెన్ అతి సమీపంలో ఉన్నారు. తన విజయంపై బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 300 ఎలక్టోరల్ ఓట్లతో గెలవబోతున్నామని మద్దతుదారులతో బైడెన్ అన్నారు.

‘మన గెలుపుపై తుది డిక్లరేషన్ ఇంకా వెలువడలేదు. అయితే వస్తున్న నంబర్ల ప్రకారం గెలుపు మనదే. స్పష్టంగా విజయం మనదే. ఈ రేసులో మనమే నెగ్గబోతున్నాం. 24 ఏళ్లలో తొలిసారి డెమొక్రాట్లం ఆరిజోనాలో గెలవబోతున్నాం. జార్జియాలో 28 ఏళ్ల తర్వాత గెలుపుఢంకా మోగించబోతున్నాం. నాలుగేళ్ల క్రితం కూలిపోయిన బ్లూవాల్‌‌ (డెమొక్రాట్ పార్టీ)ను దేశం మధ్యలో పునర్నిర్మిద్దాం’ అని మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్ ట్వీట్ చేశారు.