నేను పవర్​ చేపట్టాక 100 రోజులు మాస్క్

నేను పవర్​ చేపట్టాక 100 రోజులు మాస్క్

పెట్టుకోవాలని ప్రజలను కోరుతా: బైడెన్

ఇండియాతో కలిసి ‘గాంధీ‑కింగ్’లపై స్టడీకి చట్టం

ఆమోదించిన అమెరికా ప్రతినిధుల సభ

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్​గా జనవరి 20న పగ్గాలు చేపట్టిన తర్వాత తాను మొట్టమొదటగా కరోనా కంట్రోల్ కు చర్యలు తీసుకుంటానని ఇదివరకే ప్రకటించిన జో బైడెన్.. అమెరికన్ లు100 రోజులు మాస్క్ లు పెట్టుకోవాలని కోరతానని వెల్లడించారు. ప్రెసిడెంట్ అయ్యాక తాను తీసుకునే ఫస్ట్ యాక్షన్ ఇదేనని ఆయన గురువారం చెప్పారు. జీవితాంతం కాదు.. కేవలం 100 రోజులే మాస్క్​లు పెట్టుకోవాలని, మాస్క్ లతో వైరస్ ను గణనీయంగా తగ్గించొచ్చన్నారు. మాస్క్ పెట్టుకోవడం ఒక ప్యాట్రియాటిక్ డ్యూటీ అని బైడెన్ ఎన్నికల ప్రచారంలో కూడా పదే పదే చెప్పారు.

గాంధీ–లూథర్​ కింగ్​లను ఫాలో అవుదాం

మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ల ఫిలాసఫీ, వారసత్వాన్ని స్టడీ చేసేందుకు, వారి టీచింగ్స్ ను ఫాలో అయ్యేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఓ కీలక బిల్లును ఆమోదించింది. గాంధీ, కింగ్ లు అనుసరించిన అహింసా మార్గం, ఎడ్యుకేషన్, హెల్త్ తదితర అంశాలపై వారు చెప్పిన విషయాలపై స్టడీ చేస్తూ.. పాలసీ పరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘గాంధీ–కింగ్ స్కాలర్లీ ఎక్స్చేంజ్ ఇనీషియేటివ్ యాక్ట్’ పేరుతో ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ తో కలిసి గాంధీ, కింగ్ ల ఫిలాసఫీని ప్రోత్సహించే చర్యలను అమెరికా విదేశాంగ శాఖ చేపట్టనుంది.

పాలసీ సవాళ్లకు పరిష్కారాలు..  

చట్టం కింద గాంధీ–కింగ్ గ్లోబల్ అకాడమీ, యూఎస్–ఇండియా గాంధీ‌‌‌‌‌‌‌‌–కింగ్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ లను ఏర్పాటు చేయనున్నారు. రెండు దేశాలు క్లైమేట్ చేంజ్, ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్ రంగాల్లో పాలసీ పరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ ఇలియట్ ఎంగెల్ అన్నారు.

ఐదేళ్లలో 5 కోట్ల డాలర్లు..

కొత్త చట్టం ప్రకారం.. గాంధీ–కింగ్ గ్లోబల్ అకాడమీకి 2021లో 20 లక్షల డాలర్ల (రూ. 14 కోట్లు)ను అమెరికా కేటాయించనుంది. యూఎస్‌‌‌‌‌‌‌‌–ఇండియా గాంధీ–కింగ్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ కు 3 కోట్ల డాలర్లు (రూ .221 కోట్లు) ఇవ్వనుంది. ఈ ఫౌండేషన్ కు 2022 నుంచి 2025 వరకు ఏటా1.5 కోట్ల డాలర్లు (రూ. 110 కోట్లు) కేటాయిస్తారు. అయితే మన దేశంలోని ప్రైవేట్ సెక్టార్ నుంచి కూడా నిధులు వస్తేనే ఈ ఫండ్స్ ను యూఎస్ సర్కార్ విడుదల చేస్తుంది. మొత్తంగా ఈ చట్టం కింద చేపట్టే పనుల కోసం ఐదేళ్లలో 5 కోట్ల డాలర్ల (రూ. 368 కోట్లు)ను కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ విడుదల చేయనుంది.

For More News..

35 వేల జాబులకు కోటి మంది పోటీ