
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించి అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయిందని విమర్శించారు.
సీఎం రేవంత్రెడ్డి బీసీలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తారని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం కేంద్రం ఆధీనంలో ఉందంటూ చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. సమావేశంలో నాయకులు మర్శెట్టి గోవర్ధన్, రౌత్ మనోహర్, మెట్టు ప్రహ్లద్, జగదీశ్ పాల్గొన్నారు.