
తిర్యాణి, వెలుగు: జీవో 49ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఈనెల 21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు సమితి నాయకులు తెలిపారు. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని తిర్యాణిలోని కుమ్రంభీం చౌరస్తా వద్ద నేతలు మాట్లాడారు. మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మిక, ఆయా సంఘాల నాయకులు మద్దతు తెలపాలని కోరారు. తుడుం దెబ్బ డివిజనల్ ఉపాధ్యక్షులు సుభాశ్, గణపతి, మండల అధ్యక్షుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జీవో 49 పత్రాల దహనం
కాగజ్ నగర్, వెలుగు: జీవో నంబర్ 49ను రద్దు చేయాలని కోరుతూ బెజ్జూర్ మండల ఆదివాసీ సంఘాల అధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం జీవో పత్రాలను దహనం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని జీవో నంబర్ 49ని రద్దు చేసి ఆదివాసీకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గౌరవ అధ్యక్షులు సిడం సక్కారం, కొలవార్ సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షుడు మేకల శ్యామ్ రావు, జిల్లా యువజన అధ్యక్షులు మెడి సతీశ్, సహాయ కార్య దర్శి వెంకటేశ్ పాల్గొన్నారు.