ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
నగరంలోని ప్రధాన బస్టాండ్ మురుగునీటితో కంపు కొడుతోంది. దాన్ని దాటితే తప్పా ప్రయాణికులు బయటకూ, లోపలికి వెళ్లే పరిస్థితి లేదు.  గత కొద్ది రోజులుగా డ్రైనేజీ లీకేజీతో  బస్టాండ్​ ఆవరణ అంతా గలీజ్ గా మారింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.   డ్రైనేజీ ఎక్కువ లీక్​ అవుతున్నా  అధికారులు పట్టించుకోవడం లేదు.   ప్రయాణికులు, బస్సులు అన్నీ ఆ మురుగు నీటిలోంచే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.  తెలంగాణా ఆర్టీసీ చైర్మన్  సొంత జిల్లాలోని బస్టాండే ఇలా ఉండటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి   మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.  -  వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
 

కంచెను తొలగించిన వారిపై చర్యలు తీసుకుంటాం

బోధన్​,వెలుగు: బోధన్​ – నిజామాబాద్​ రహదారి పక్కన ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన కంచెను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో రాజేశ్వర్​, ఏసీపీ కిరణ్​కుమార్, తహాసీల్దార్​ వరప్రసాద్​, సీఐ ప్రేమ్​ కుమార్​ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాజేశ్వర్​ మాట్లాడుతూ.. కలెక్టర్​ ఆదేశాలమేరకు కంచెను ఏర్పాటు చేశామని, తొలగించిన వ్యక్తులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 

రైతే రాజు ప్రోగ్రామ్​కు తరలిరండి

నిజామాబాద్ , వెలుగు : ఈనెల 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో నిర్వహించే ‘రైతే రాజు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రైతే రాజు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్బన్ నియోజకవర్గంలోని శ్రద్ధానంద్ లో ఉన్న ఉమామహేశ్వర కల్యాణ మండపం లో భారీ ఎల్ఈడి తెరల ద్వారా ప్రధానమంత్రి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అర్బన్ నియోజకవర్గ పరిధిలోని రైతులు తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో ప్రధాని మోడీ ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉందని అన్నారు ఈ సమావేశం లో కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీ నారాయణ, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, శివునూరి భాస్కర్, భాస్కర్ రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

కుట్ర పూరితంగానే ఐటీ  దాడులు

సిరికొండ,వెలుగు:   మంత్రి గంగుల కమాలకర్​పై కుట్రపూరితంగానే ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని మున్నూరు కాపు ఐక్య వేదిక నాయకులు ఆకుల తిర్మల్​ అన్నారు. మండలకేంద్రంలో గురువారం  సమావేశం నిర్వహించారు.  బీసీ నాయకుడిపై దాడులు సరికాదని, బీజేసీ నాయకులు కావాలనే వ్యక్తిగత  కుట్రాలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో లీడర్లు ఇజాప గోపాల్​,శ్రీనివాస్​ , చిన్నారెడ్డి చిగురు శ్రీనివాస్​, బూక రాజు, సురేందర్​  ఉన్నారు.

ఆర్వోబీ పనులను పరిశీలించిన ఎంపీ అర్వింద్​

ఆర్మూర్/మాక్లూర్, వెలుగు:  మండలంలోని మామిడిపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను  ఎంపీ ధర్మపురి అర్వింద్​ గురువారం పరిశీలించారు. రైల్వే,  ఆర్​అండ్​బీ, నేషనల్​ హైవే అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు.  అనంతరం అర్వింద్​ మీడియాతో మాట్లాడారు. మునుగోడులో  టీఆర్​ఎస్​ గెలుపు..  గెలుపే  కాదని  విమర్శించారు. రానున్న  ఎలక్షన్లలో  బీజేపీ దెబ్బకు టీఆర్​ఎస్ కొట్టుకుపోతుందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇక్కడ ఆర్ఓ బీ పనుల్లో జాప్యం జరిగిందని, డిజైన్లు, ఎస్టిమేషన్లు మార్చి పనులు జరగకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కారణమన్నారు.  ఏడాదిన్నరగా తాను వెంపడటంతో ఆర్వోబీ పనుల్లో వేగం పెరుగుతుందన్నారు. ఈ నెలాఖరులోగా గోవింద్ పేట్​ ఆర్వోబీ పనులు పూర్తవుతాయన్నారు. అడవి మామిడిపల్లి వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ తో ఆర్వోబీ పనుల్లో జాప్యం జరుగుతుందని చెప్పారు.  గడువు కంటే ముందే పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, నియోజకవర్గ నాయకులు కంచెట్టి గంగాధర్, టౌన్​ ప్రెసిడెంట్​ జెస్సు అనిల్, ఆకుల రాజు, గంగోని సంతోష్ పాల్గొన్నారు.  నిధులున్నా ఆలస్యం ఎందుకవుతుందని,  తొందరగా పనులు పూర్తి చేయాలని   కాంట్రాక్టర్​కు సూచించారు.  ఎంపీ వెంట   పల్లె గంగారెడ్డి, కంచెట్టి గంగాధర్, గంగోనె సంతోష్​  ఉన్నారు. 

అయిల్​ పామ్​ సాగుపై అవగాహన కల్పించాలి

కామారెడ్డి , వెలుగు : అయిల్​పామ్​ సాగుపై అగ్రికల్చర్​, హర్టికల్చర్​ ఆఫీసర్లు రైతులకు అవగాహాన కల్పించాలని కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​ సూచించారు. అయిల్​పామ్​ సాగుపై గురువారం జరిగిన మీటింగ్​లో కలెక్టర్​ మాట్లాడుతూ.. సబ్సిడీలో మొక్కలను పంపిణీ చేయటంతో పాటు, డ్రిప్​​ ఇరిగేషన్​ సిస్టమ్​ కూడా ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 1800 ఎకరాల్లో అయిల్​పామ్​ సాగు చేసుకొవటానికి రైతులు రిజిస్ర్టేషన్​ చేసుకున్నారని, ఇంకా సాగు పెరిగేలా చూడాలన్నారు. 
ఈ సమావేశంలో డీఏవో భాగ్యలక్ష్మి, హర్టికల్చర్​ ఆఫీసర్​ విజయ్​భాస్కర్​రెడ్డి, లీడ్​ బ్యాంక్​ 
మెనేజర్​ రమేశ్​కుమార్​, తదితరులు పాల్గొన్నారు. 

దళితబంధు యూనిట్ల తనిఖీ​

బోధన్, వెలుగు: పట్టణంలో దళితబంధు యూనిట్లను మున్సిపల్​ కమిషనర్​ ఎండీ ఖమర్​ హైమద్​ గురువారం పరిశీలించారు. యూనిట్లు సరిగ్గా నడుస్తున్నాయా లేదా? వారి ఆదాయం ఎంత? లాంటి వివరాలు కనుక్కున్నారు. పట్టణంలో 15 యూనిట్లు మంజూరు అయ్యాయని, 14 యూనిట్లు గ్రౌండ్ అయ్యాయని తెలిపారు. దళిత బంధు యూనిట్లతో మంచి ఆదాయం వస్తుందని లబ్దిదారులు సంతృప్తి వ్యక్తంచేసినట్లు మున్సిపల్​ కమిషనర్​ తెలిపారు.
ఇందల్వాయి : మండలంలోని లోలం గ్రామంలో దళిత బంధు యూనిట్లను ఎంపీడీవో రాములు నాయక్​ గురువారం తనిఖీ చేశారు. వెహికిల్స్​, డెయిరీ ఇతర 
వ్యాపారాలు పెట్టుకున్న 15 మంది లబ్ధిదారుల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్​ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు.

కుట్ర పూరితంగానే ఐటీ  దాడులు

సిరికొండ,వెలుగు: మంత్రి గంగుల కమాలకర్​పై కుట్రపూరితంగానే ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని మున్నూరు కాపు ఐక్య వేదిక నాయకులు ఆకుల తిర్మల్​ అన్నారు. మండలకేంద్రంలో గురువారం  సమావేశం నిర్వహించారు.  బీసీ నాయకుడిపై దాడులు సరికాదని, బీజేసీ నాయకులు కావాలనే వ్యక్తిగత  కుట్రాలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో లీడర్లు ఇజాప గోపాల్​,శ్రీనివాస్​ , చిన్నారెడ్డి చిగురు శ్రీనివాస్​, బూక రాజు, సురేందర్​  ఉన్నారు.

ఓటర్​, ఆధార్ ​లింక్​ చేయాలె

బోధన్, వెలుగు: ఓటర్​ కార్డును ఆధార్​తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలని ఆర్డీవో రాజేశ్వర్​ సూచించారు. గురువారం బోధన్​ మున్సిపల్​ ఆఫీసులో కౌన్సిలర్లు, ఆర్​పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాజేశ్వర్​ మాట్లడుతూ 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఆధార్​ అనుసంధానం ఉన్న ఓటర్​ జాబితా మాత్రమే వస్తుందని తెలిపారు. కౌన్సిలర్లు, ఆర్​పీలు వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించి,  ఓటర్​ కార్డుకు ఆధార్​ అనుసంధానం చేయించలన్నారు. బోధన్​ టౌన్​ ఆధార్​ అనుసంధానంలో వెనుకబడి ఉందని తెలిపారు. అలాగే 2023 జనవరి వరకు 18 యేండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు నమోదు చేయించాలన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ ఎండీ ఖమర్​ హైమ్మద్​ , కౌన్సిలర్లు, ఆర్​పీలు తదితరులు పాల్గొన్నారు. 

ధాత్రి టౌన్ షిప్ లో రిజిస్ట్రేషన్ నాటికి  సౌకర్యాలు

నిజామాబాద్ టౌన్, వెలుగు: మల్లారం ధాత్రి టౌన్ షిప్ లో ప్లాట్ల రిజిస్ట్రేషన్  నాటికే రోడ్లు, డ్రైనేజీలు, నీటి వసతి,  కరెంట్​  వంటి మౌలిక సదుపాయాల  కల్పిస్తామని  కలెక్టర్  నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే బీటీ రోడ్ల నిర్మాణాలు  పూర్తి కావచ్చాయని తెలిపారు. ధాత్రి టౌన్ షిప్ లో ప్లాట్ల విక్రయానికి ఈ నెల 14 న సమీకృత జిల్లా కార్యాలయాల్లో  బహిరంగ వేలంపాట నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తు అవగాహన కల్పించేందుకు   ప్రీ బిడ్డింగ్ సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశానికి వచ్చిన ఔత్సాహికులకు ధాత్రి టౌన్ షిప్ ప్రత్యేకతల గురించి కలెక్టర్  వివరించారు. డీటీసీపీ అప్రూవుడ్ లేఅవుట్ కలిగిన ధాత్రి టౌన్ షిప్ లో ఉద్యోగులు, వ్యాపారులు, ఎన్ ఆర్ ఐ లకు  రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.  మొదటి రోజు  40 ప్లాట్లకు, ఆ మరుసటి రోజు 15 న మరో 40 ప్లాట్లకు వేలం  ఉంటుందన్నారు.   సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ చిత్రామిశ్రా, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్, ఆర్దీఓ రవి, టీఎస్ఐఐసీ అధికారులు రాందాస్, దినేశ్​ పాల్గొన్నారు. 

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి

కామారెడ్డి . వెలుగు : జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రెసిడెంట్​ సాప శివరాములు డిమాండ్​ చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీలు బీసీల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. 60 శాతం బీసీలు ఉంటే 25 నుంచి 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని​ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వైస్​ ప్రెసిడెంట్​ శ్రీగాధ రమేశ్​, ప్రతినిధులు మోహనచారి, ఉస్మాన్​, పెద్దొల్ల మహేశ్​​, రవికుమార్​  తదితరులు పాల్గొన్నారు. 

ఆర్మూర్ లో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి క్రీడలు 

ఆర్మూర్, వెలుగు:  పట్టణంలోని సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ స్కూల్​ గ్రౌండ్ లో సోషల్​ వెల్ఫేర్​ విద్యాసంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడ పోటీలు కొనసాగుతున్నాయి. గురువారం ఆర్సీఓ యేసు పాదం హాజరై క్రీడాకారును పరిచయం చేసుకుని రెండో రోజు పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను ఈ నెల చివరి వారంలో జరగబోయే ఇంటర్ సొసైటీ క్రీడా పోటీలకు ఎంపిక చేసి ట్రైనింగ్​ కు పంపిస్తామన్నారు. ప్రిన్సిపల్ దుర్గారెడ్డి , ఓవరాల్ ఇంచార్జ్ నీరజ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉదయ భాస్కర్, వైస్ ప్రిన్సిపల్ సంధ్యారాణి, శ్రీధర్, పీఈటీలు, పీడీలు పాల్గొన్నారు.

సిర్నాపల్లిలో సినిమా షూటింగ్​ సందడి

ఇందల్వాయి, వెలుగు: మండలంలోని సిర్నాపల్లి లో గురువారం షూటింగ్​ సందడి నెలకొంది. ప్రముఖ సినీ నటుడు సుమన్​ నటిస్తున్న‘99 శాతం ప్రేమ ఒక శాతం మీ ఆశీర్వాదాలు’ షూటింగ్​ గురువారం స్థానికంగా మొదలుపెట్టారు.  పల్లెటూరులో హీరో, హీరోయిన్​ లవ్​ స్టోరీ నేపథ్యంలో సినిమా ఉంటుందని  మూవీ డైరెక్టర్​ మునీశ్వర్​ చెప్పారు. హీరోయిన్​ తండ్రిగా, గ్రామ పెద్ద గా సుమన్​ నటిస్తున్నారని చెప్పారు. సిర్నాపల్లి జానకీబాయి గడితో పాటు, రాత్రి పూట అడవి లో షూటింగ్​కు అనువుగా ఉంటుందని గ్రామాన్ని ఎంచుకున్నట్లు డైరెక్టర్​ చెప్పారు.

అరుణోదయ మహాసభలను సక్సెస్​ చేయండి

మాక్లూర్, వెలుగు: పాటలతో ప్రజలను చైతన్యం చేస్తూ, ఉద్యమాలకు అరుణోదయ కళాకారులు ఊతమిస్తున్నారని రాష్ర్ట నాయకులు దాసు అన్నారు. నవంబర్ 19,20 న మహబూబ్​ నగర్​లో జరిగే అరుణోదయ మహాసభల పోస్టర్​ను మండలంలోని
బోర్గాం(కే)లో గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రామిక పక్షపాతిగా, సమస్యలపై ఉద్యమిస్తున్న వారికి   అరుణోదయ అండగా ఉంటుందన్నారు. మహబూబ్ నగర్​లో జరిగే మహాసభలను, బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా నాయకులు నర్సయ్య, పోశెట్టి, గంగాధర్, సాయిరెడ్డి, మోహన్, కృష్ణ తదితరులు ఉన్నారు.