హైదరాబాద్ ఆర్పీవోగా జొన్నలగడ్డ స్నేహజ

హైదరాబాద్ ఆర్పీవోగా జొన్నలగడ్డ స్నేహజ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్(ఆర్పీవో)గా  జొన్నలగడ్డ స్నేహజ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సిటీకి చెందిన స్నేహజ 2016 ఇండియన్ ఫారిన్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్) బ్యాచ్​అధికారి.

గతంలో బీజింగ్ లోని ఇండియన్ ఎంబసీలోని సెకండ్ సెక్రటరీ, ఢిల్లీలోని మయన్మార్, బంగ్లాదేశ్ డివిజన్లకు అండర్ సెక్రటరీగా ఆమె పనిచేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విజిలెన్స్ విభాగంలోనూ ఆమె విధులు నిర్వర్తించారు.