ఈ సీజన్లో అన్ని అవార్డుల్లో బట్లర్‌‌దే హవా

ఈ సీజన్లో అన్ని అవార్డుల్లో బట్లర్‌‌దే హవా

అహ్మదాబాద్: ఐపీఎల్‌‌15లో  బ్యాట్‌‌తో దంచికొట్టిన రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్.. ప్రైజ్ మనీలోనూ దుమ్మురేపాడు. ఈ సీజన్‌‌ మొత్తంలో ఏకంగా 37 అవార్డులు అందుకున్న బట్లర్‌‌ వాటిద్వారా  రూ.95 లక్షల ప్రైజ్‌‌మనీ ఖాతాలో వేసుకొని ఔరా అనిపించాడు.  సీజన్‌‌ అవార్డుల్లో ఆరెంజ్‌‌ క్యాప్‌‌, మోస్ట్ వాల్యుబుల్‌‌, గేమ్‌‌ చేంజర్‌‌, మ్యాగ్జిమమ్‌‌ ఫోర్స్‌‌, మ్యాగ్జిమమ్‌‌ సిక్సెస్‌‌, పవర్‌‌ ప్లేయర్‌‌ పురస్కారాలతో రూ. 60 లక్షలు గెలుచుకున్నాడు. లీగ్ స్టేజ్‌‌లో రెండుసార్లు, క్వాలిఫయర్–2లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌‌ అందుకున్న బట్లర్ వీటి ద్వారా రూ. 7లక్షలు సాధించాడు. వివిధ  మ్యాచ్‌‌ల్లో పవర్ ప్లేయర్,  గేమ్ చేంజర్,  మోస్ట్ ఫోర్స్,  మోస్ట్‌‌ సిక్సెస్‌‌, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌‌, సూపర్ స్ట్రైకర్‌‌ అవార్డులతో మరో 28 లక్షలు  కైవసం చేసుకున్నాడు.