ఫైనల్ లో భారత్ , పాక్ ను చూడాలనుకోవడం లేదు: జోస్ బట్లర్

ఫైనల్ లో భారత్ , పాక్ ను చూడాలనుకోవడం లేదు: జోస్ బట్లర్

క్రికెట్ లో ఎన్ని మ్యాచ్ లున్నా..ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు ఉండే ఆ కిక్కే వేరు.  ఈ రెండు టీంలు తలపడుతున్నాయంటే యావత్ క్రికెట్ ఫ్యాన్సే కాకుండా  క్రికెటర్లు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పటికే టీ 20 వరల్డ్ కప్ లీగ్ దశల్లో ఇండియా పాక్ ఓసారి తలపడ్డాయి. ఇందులో ఇండియా విక్టరీ సాధించింది. గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్,ఇంగ్లాండ్, గ్రూప్ 2 నుంచి ఇండియా,పాకిస్తాన్ సెమీఫైనల్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.

అయితే ఇవాళ న్యూజిలాండ్ పాకిస్తాన్ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.  ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై గెలిస్తే  పాకిస్తాన్ ఫైనల్ కు వెళ్తుంది. అలాగే రేపు జరగనున్న సెకండ్ సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ పై గెలిస్తే ఇండియా ఫైనల్ కు వెళ్తుంది. ఈ రెండూ జరిగితే అపుడు మరోసారి ఇండియా పాకిస్తాన్ ఫైనల్ పోరు రసవత్తరంగా మారుతోంది. అయితే లేటెస్ట్ గా ఇండియా, పాక్ మ్యాచ్ పై ఇంగ్లాడ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ కామెంట్ చేశారు. ఫైనల్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ను చూడాలనుకోవడం లేదన్నాడు.  అలా జరగకుండా  ఉండేందుకు తాము ప్రయత్నిస్తామన్నాడు. తప్పకుండా రేపు జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ ను ఓడిస్తామని చెప్పాడు.