RCBకి మంచి రోజులొచ్చాయ్.. జట్టులో చేరిన స్టార్ ఆటగాడు

RCBకి మంచి రోజులొచ్చాయ్.. జట్టులో చేరిన స్టార్ ఆటగాడు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇక మంచి రోజులొచ్చాయి. గెలుపు బాట పట్టించేందుకు స్టార్ ఆటగాడు గ్రౌండ్ లో అడుగుపెట్టనున్నాడు. గాయం కారణంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లకు దూరం అయిన స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్.. టీంలో జోష్ నింపడానికి జట్టులో చేరినట్లు తెలుస్తోంది.

హేజిల్వుడ్ 100శాతం ఫిట్ గా ఉన్నాడని.. మే 1న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈక్రమంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు జట్టు 8 మ్యాచుల్లో 4 గెలిచి, 4 ఓడి పాయింట్స్ టేబుల్లో 5వ స్థానంలో నిలిచింది.