అపర్ణ యూనిస్పేస్ ప్రొడక్టుల్లో పెయింటింగ్ సొల్యూషన్స్‌‌‌‌

అపర్ణ యూనిస్పేస్ ప్రొడక్టుల్లో పెయింటింగ్ సొల్యూషన్స్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: అపర్ణ ఎంటర్‌‌‌‌ప్రైజెస్.. లగ్జరీ బాత్ స్పేస్‌‌‌‌, కిచెన్ రిటైల్ విభాగం అయిన అపర్ణ యూనిస్పేస్, నార్వే ఆధారిత డెకరేటివ్ పెయింట్స్ తయారీదారు - జోతున్ పెయింట్స్‌‌‌‌తో పార్ట్​నర్​షిప్​ కుదుర్చుకుంది. అపర్ణ యూనిస్పేస్ ప్రొడక్ట్​ పోర్ట్‌‌‌‌ఫోలియోలో ఇక నుంచి పెయింటింగ్ సొల్యూషన్స్‌‌‌‌ కూడా ఉంటుంది. జూబ్లీ హిల్స్‌‌‌‌లోని తమ షోరూమ్‌‌‌‌లో తమ ప్రొడక్టులను చూపించడానికి ఎక్స్‌‌‌‌పీరియన్స్ జోన్‌‌‌‌ను సైతం ఏర్పాటు చేశామని అపర్ణ యూనిస్పేస్ సీఈఓ సతీష్ భార్గవ్ వెల్లడించారు.

జోతున్ పెయింట్స్‌‌‌‌ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక పేరును సృష్టించుకుందన్నారు. ఈ పార్ట్​నర్​షిప్​ వల్ల బాత్​రూమ్​, కిచెన్​ విభాగంలో  తాము వన్​ -స్టాప్  సొల్యూషన్​గా నిలుస్తామని అన్నారు. అసోసియేషన్ కస్టమర్లకు జోతున్ పెయింట్లను ఇంటీరియర్  ఎక్స్‌‌‌‌టీరియర్ సర్ఫేస్‌‌‌‌లకు వేస్తామని, వీటిలో ప్రీమియం, టెక్స్‌‌‌‌చర్డ్  ఇంటీరియర్ డిజైనర్ స్టైల్స్‌‌‌‌లో అనేక ఫినిష్​లు ఉంటాయని సతీష్​ వివరించారు.