
రాజన్నసిరిసిల్ల,వెలుగు: గుండెపోటుతో జర్నలిస్ట్ గడదాసు ప్రసాద్ (43) చనిపోయాడు. సిరిసిల్ల పట్టణంలో ఓ టీవీ రిపోర్టర్ గా ప్రసాద్ కొంత కాలంగా పని చేస్తున్నారు. శనివారం ఉదయం గుండె నొప్పితో బాధపడగా కుటుంబ సభ్యులు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించి సీపీఆర్చేశారు. మెరుగైన చికిత్స కోసం కరీనంగర్ తరలించగా అప్పటికే ప్రసాద్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
ప్రసాద్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రసాద్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్రమంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్యెల్యే కేటీఆర్ సంతాపం తెలిపారు. కేటీఆర్, బండి సంజయ్ రూ. 50 వేల ఆర్థికసాయం చేశారు. ప్రసాద్ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రకటించారు.