కాల్పుల్లో గాయపడ్డ జర్నలిస్ట్‌ మృతి

కాల్పుల్లో గాయపడ్డ జర్నలిస్ట్‌ మృతి
  • హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ మృతి
  • 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

ఘజియాబాద్‌: ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దుండగుల కాల్పుల్లో గాయపడి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న జర్నలిస్టు విక్రమ్‌ జోషి చనిపోయారు. బుధవారం ఉదయం పరిస్థితి విషమించి చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. సోమవారం రాత్రి 10:30 గంటలకు తన చెల్లి ఇంటి నుంచి ఇద్దరు కూతుళ్లతో బైక్‌పై వస్తున్న జర్నలిస్టు విక్రమ్‌ జోషిపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. కారు దగ్గరికి లాకెళ్లి తలపై కాల్పులు జరిపారు. రోడ్డుపై పడిపోయిన ఆయనను కూతురు జోషి స్థానికుల సాయంతో హాస్పిటల్‌కు తరలించింది. జోషీ కూతురు సాయం కోసం వేడుకుంటున్న వీడియో బయటికి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఇప్పటి వరకు 7గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. విక్రమ్‌ జోషి కుటుంబానికి 10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. ఆయన భార్యకు ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారని అధికారులు చెప్పారు.