భోపాల్లో జర్నలిస్టులను అర్ధనగ్నంగా నిలబెట్టిన్రు

భోపాల్లో జర్నలిస్టులను అర్ధనగ్నంగా నిలబెట్టిన్రు
  • సీఐ, ఎస్ఐ సస్పెండ్ చేసిన ప్రభుత్వం

భోపాల్: అధికార పార్టీ ఎమ్మెల్యేకి కొందరు పోలీసులు తొత్తులుగా మారారు. ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే కారణంగా జర్నలిస్టులను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి అర్ధనగ్నంగా నిలబెట్టారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జర్నలిస్టు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. సీఐ కొట్వాలి సిద్ధి, ఎస్సైలను సస్పెండ్ చేస్తూ... పోలీస్ లైన్స్ కు అటాచ్ చేసింది. 

ఇకపోతే.. భోపాల్ కు చెందిన కనిష్క్ తివారి ఓ ట్యూబ్ జర్నలిస్ట్. అతడి ఛానెల్‌కు ఒకటిన్నర లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తివారి నేషనల్ న్యూస్ ఛానెళ్లకు కూడా వార్తలు పంపుతుంటాడు. కాగా.. స్థానిక ఎమ్మెల్యే కేదారినాథ్ శుక్లాకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తున్నారని, తివారితో పాటు మరికొంత మంది జర్నలిస్టులను స్థానిక పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. అనంతరం విచారణ పేరుతో బట్టలిప్పించి అర్ధ నగ్నంగా నిలబెట్టారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై మరోసారి చర్చ మొదలైంది. ఈ ఘటనకు కారకులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

మరిన్ని వార్తల కోసం..

సర్ఫ్, నూనె, కెమికల్స్​తో పాల తయారీ

పెళ్లికి పెట్రోల్, డీజిల్ బాటిళ్లు గిఫ్ట్ గా ఇచ్చిన ఫ్రెండ్స్