కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమాగం : జేపీ నడ్డా

 కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమాగం : జేపీ నడ్డా

ఎంతోమంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడితే  ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.  నాగుర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ నవ సంకల్ప సభలో నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ఆహుతైన వారికి నడ్డా నివాళులర్పి్ంచారు.  మోడీ పాలనలో దేశం అభివృద్ధి  పధంలో దూసుకుపోతుంటే కేసీఆర్  పాలనలో మాత్రం తెలంగాణ ఆగమైపోతుందన్నారు.  

తెలంగాణ సామార్ధ్యాన్ని కేసీఆర్ నాశానం చేశాడని నడ్డా ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని, వీరిని జైలుకు పంపాల్సిన అవసరం ఉందన్నారు.  తెలంగాణ అభివృద్ధికి మోడీ భారీ ఎత్తున నిధులు ఇచ్చారని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎప్పుడు సహకరిస్తుందనే చెప్పారు.  80 కోట్ల ప్రజలకు కేంద్రం రేషన్ ఇస్తు్ందని చెప్పిన నడ్డా..  దేశంలో పేదరికం 10 శాతం కంటే తక్కువకు పడిపోయిందని అన్నారు. 

ప్రపంచం మొత్తం మోడీని హీరో, గ్లోబల్ లీడర్ అని పొగుడుతుంటే కాంగ్రెస్ నేతలకు కడుపు మండుతుందన్నారు నడ్దా. ఈజిప్టు అత్యున్నత పురస్కారం మోడీకి ఇచ్చారంటే ఆయన దేశానికి, ప్రపంచానికి ఎంత చేశాడో అర్థం చేసుకోవాలని చెప్పారు.  మోడీని ది బాస్ అని దేశాధినేతలే కొనియాడుతున్నారని  చెప్పారు.  కరోనా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అర్థి్కంగా దూసుకుపోతున్న ఏకైక దేశం మనదేనని చెప్పారు.