గుజరాత్ ప్రజలకు మోడీపై నమ్మకం ఉంది : జేపీ నడ్డా

గుజరాత్ ప్రజలకు మోడీపై నమ్మకం ఉంది : జేపీ నడ్డా

గుజరాత్ లో వార్ వన్ సైడ్ గా ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీజేపీకి మద్దతు తెలిపేందుకు ప్రజలు వెయిట్ చేస్తున్నారని ఆయన తెలిపారు. గుజరాత్ ప్రజలకు మోడీపై ఎంతో నమ్మకం, ప్రేమ ఉందన్నారు.

సీఎం భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. గుజరాత్ లోని హిమ్మత్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో జేపీ నడ్డా మాట్లాడారు. డిసెంబర్ 1, 5న జరిగే ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా తీర్పు రాబోతోందని ఆయన వ్యాఖ్యానించారు.