చీపురు పట్టి ఇల్లు ఊడ్చి, తుడిచిన యంగ్ టైగర్

చీపురు పట్టి ఇల్లు ఊడ్చి, తుడిచిన యంగ్ టైగర్

లాక్డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దాంతో ఏంతోచక ఏదో ఒక పని చేస్తున్నారు. తాజాగా దర్శకుడు రాజమౌళి ఇళ్లు ఊడ్చి, ప్లోర్ తూడ్చి, కిటికీలు మరియు తలుపులు తూడ్చాడు. ఆ విధంగా ఇంట్లో వాళ్లకు హెల్ప్ చేద్దాం అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాంచరణ్, కీరవాణి, శోభు యార్లగడ్డ మరియు సుకుమార్ లకు చాలెంజ్ విసిరాడు.

ఆ సవాల్ ను స్వీకరించిన ఎన్టీఆర్ తన ఇంట్లో చీపురు పట్టి ఇంట్లో మరియు గార్డెన్ లో చెత్తను ఊడ్చాడు. ఇంట్లో ఫ్లోర్ మొత్తం తూడ్చాడు. అంతేకాకుండా గిన్నెలు కూడా తోమి, వాటిని పొడిబట్టతో తూడిచాడు.

మన ఇంట్లో ప్రేమలు, ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం. ఇంట్లో పనులను పంచుకుంటే అది చాలా గమ్మత్తుగా ఉంటుంది అని తాను చేసిన పనులను వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.

తాను చేసిన పనిని… తోటి హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, దర్శకుడు శివ కొరటాలకు చాలెంజ్ గా విసిరాడు. ఎన్టీఆర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది.

ప్రాక్టిస్ చేస్తూ చనిపోయిన ఫుట్ బాల్ ఆటగాడు

ఎన్టీఆర్, రాంచరణ్ లకు సవాల్ విసిరిన రాజమౌళి