Jr NTR Pencil Art: యంగ్ టైగర్ ఫొటోకు ఇంత క్రేజా? రికార్డు ధరకు జూ. ఎన్టీఆర్ పెన్సిల్ ఆర్ట్ !

Jr NTR Pencil Art: యంగ్ టైగర్ ఫొటోకు ఇంత క్రేజా?  రికార్డు ధరకు జూ. ఎన్టీఆర్  పెన్సిల్ ఆర్ట్ !

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన గురించి ఏ చిన్న వార్త బయటకువచ్చినా క్షణాల్లో వైరల్ మారిపోతోంది. అలాంటిదే ఇప్పుడు అభిమానులు పండగ చేసుకునే వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. ఎన్టీఆర్ క్రేజ్ ఆయన సినిమాలకు మాత్రమే కాదు, ఆయన ఫోటోలకు కూడా ఉందని నిరూపితమతోంది. పెన్సిల్ ఆర్ట్ తో రూపొందించి ఎన్టీఆర్ చిత్రం రికార్డు స్థాయిలో ధరకు అమ్ముడైంది.

చరిత్ర సృష్టించిన పెన్సిల్ ఆర్ట్ 
'బులా రుబీ' అనే పెన్సిల్ ఆర్టిస్ట్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని అద్భుతమైన నైపుణ్యంతో రూపొందించారు. ఈ చిత్రం తాజాగా చరిత్ర సృష్టించింది. ఒక తెలుగు నటుడి పెన్సిల్ ఆర్ట్ ఇప్పటివరకు అమ్ముడైన వాటిలో అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఈ పెన్సిల్ ఆర్ట్ ఏకంగా 1650 అమెరికన్ డాలర్లకు, అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.1,45,300 కు అమ్ముడుపోయింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆర్టిస్ట్ ఆనందం
ఈ అరుదైన ఘనత పట్ల ఆర్టిస్ట్ బులా రుబీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన 'X' ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇది నిజంగా అద్భుతం. నా పెన్సిల్ ఆర్ట్ ఇలాంటి చరిత్ర సృష్టిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఈరోజు నా జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ ఆర్ట్ ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన పెన్సిల్ ఆర్ట్‌గా నిలిచింది. ఈ ఘనతకు కారణమైన మీ అందరికీ నా కృతజ్ఞతలు అంటూ ఆమె పోస్ట్ చేశారు.

ALSO READ : తండ్రి.. గురువు.. దైవం అన్నీ ఎన్టీఆరే: నిమ్మకూరు పర్యటనలో బాలకృష్ణ

అభిమానుల సంబరాలు
బులా రుబీ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "దటీజ్ ఎన్టీఆర్ క్రేజ్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి దక్కిన ఈ గౌరవం పట్ల వారు గర్వపడుతున్నారు. అలాగే, తన అద్భుతమైన టాలెంట్‌తో ఎన్టీఆర్ ఫోటోను సృష్టించిన బులా రుబీని అభినందిస్తున్నారు. ఈ సంఘటన ఎన్టీఆర్‌కు ఉన్న ప్రపంచవ్యాప్త అభిమానుల బలాన్ని, కళ పట్ల వారికున్న ఆదరణను మరోసారి రుజువు చేసింది.

 

 'ఆర్ఆర్ఆర్', 'దేవర', 'వార్-2' వంటి చిత్రాలతో  జూనియర్ ఎన్టీఆర్‌ కీర్తి మరింత పెరిగింది.. ఇటీవలే హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన 'వార్-2'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది.  ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్ ఆయన సినిమాలకు మాత్రమే కాదు, ఆయన ఫోటోలకు కూడా ఉందని నిరూపితమైంది. ప్రస్తుతం డ్రాగన్, దేవర 2 చిత్రాలతో ఫుల్ బిజీ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్..